సౌందర్యను మన సౌత్ ప్రేక్షకులందరూ అలనాటి మేటి నటీమణి సావిత్రితో పోల్చుకుంటుంటారు. ఎందుకంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి తర్వాత ఎంతమంది వచ్చినా అందరు కూడా గ్లామర్ క్వీన్ అని ఏదో ఒక సినిమాలో అనిపించుకున్నవారే. కానీ, సౌందర్య వేరు. సౌందర్య నటనలో ఉన్న సహజత్వం అప్పటి సావిత్రిలో ఉంటుందని ఎంతో మంది ఇండస్ట్రీ వారు అభిమానులు, ప్రేక్షకులు పోల్చి చూసుకున్నారు.
కొన్ని సినిమాలలో అచ్చం సావిత్రి మాదిరిగానే నటించిందని సౌందర్య గురించి చెప్పుకున్నారు. కట్టుబొట్టు అంతా ఆ మహానటి మాదిరిగానే ఉందని చెప్పుకున్నారు. ఒకవేళ సౌందర్య బ్రతికి ఉంటే మహానటి బయోపిక్ చిత్రాన్ని ఆమెతోనే తీసేవారేమో. ఆ అదృష్టం కీర్తి సురేష్ కి దక్కింది. అయితే, కొందరు మాత్రం సౌందర్యను సావిత్రితో పోల్చి చూడలేమనే అంటున్నారు.
దీనికి కారణం సౌందర్య చేసిన కొన్ని గ్లామర్ చిత్రాలే. అమ్మోరు లాంటి సినిమాలు సౌందర్య ఖ్యాతిని ఎంతగా పెంచాయో అందరికీ తెలిసిందే. అదే సయమలో పక్కా కమర్షియల్ హీరోయిన్ అని నిర్మాతలే గొప్పగా చెప్పుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సౌందర్య ఎక్స్‌ఫోజింగ్ చేసింది. ఎందాల ఆరబోత కూడా చేసిన సినిమాలున్నాయి. నాగార్జున సరసన నటించిన హలో బ్రదర్ సినిమాలో సౌందర్య నాభి (బొడ్డు) చూసి హబ్బా.. అనుకున్నవారున్నారు.
అంతేకాదు, నరసింహ సినిమాలోనూ సౌందర్య అందాల ఆరబోత చూసి ముక్కున వేలు వేసుకున్నారు. అన్నయ్య, జయం మనదేరా లాంటి సినిమాలలో సౌందర్య అందాల విందు అదిరిపోతుంది. ఇలా అందాలు ఒలకబోసిన సినిమాలు సౌందర్య కెరీర్లో ఉన్నాయి కాబట్టే సావిత్రి తో పోల్చితే కొందరు ఊగిపోతున్నారు. అంత గొప్ప నటితో పోల్చిన వాళ్ళని నెగిటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు.