Moviesఅప్పుడు చరణ్..ఇప్పుడు ఎన్టీఆర్.. క్రెడిట్ కార్డు లో ఎక్కడపడితే అక్కడ గోకేస్తున్నారు...

అప్పుడు చరణ్..ఇప్పుడు ఎన్టీఆర్.. క్రెడిట్ కార్డు లో ఎక్కడపడితే అక్కడ గోకేస్తున్నారు ఏంటి బ్రో..!

యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు రాంచరణ్ ని తెగ వాడేసుకున్నారు కొందరు స్టార్ సెలబ్రెటీస్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు మరో హీరో అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పేర్లను పలువురు స్టార్స్ ఏ విధంగా వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చరణ్ పేరుని కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ చెప్పుకొని స్పెషల్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ట్రై చేశారు .

పలు సినిమాలలో చరణ్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు అంటూ సినిమా రిలీజ్ అయ్యే కొన్ని రోజులు ముందు నుంచి ప్రచారం చేసి సినిమాకి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాలో చరణ్ నటించిన ధ్రువ సినిమాకి కనెక్షన్ ఉంది అంటూ బిల్డప్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ సినిమా పూర్తిగా ఫ్లాప్ అయింది . అలాగే లోకేష్ కనగరాజు తెరకెక్కించిన లియో చిత్రంలో కూడా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది .

అయితే అవి ఏవి జరగలేదు . ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తుంది బాలీవుడ్ ఇండస్ట్రీ. టైగర్ త్రీ సినిమా ఆదివారం రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. యాష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోరిక మేరకు హృతిక్ రోషన్ గెస్ట్ గా నటించాడు అంటూ ప్రచారం చేస్తుంది బాలీవుడ్ ఇండస్ట్రీ . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ని వాడుకోవడానికి ఇలా చేయబోతున్నారు టైగర్ త్రీ మూవీ టీం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మరికొందరు వీళ్లిద్దరిని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత క్రెడిట్ కార్డుల బాగా గోకేస్తున్నారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news