తెలుగమ్మాయి అయిన బింధు మాధవి శేఖర్ కమ్ముల నిర్మాతగా ఆయన సహాయకుడు అనీష్ కురివిల్లా దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఆవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మదనపల్లి సొంతూరు. బాగా ఆస్తులున్నాయి. అన్నీ రకాలుగా బింధు మాధవి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభవం కాదు.
కానీ, శేఖర్ కమ్ముల సినిమాలో ఛాన్స్ రావడం అదే సమయంలో తమిళంలో చేరణ్ సినిమాలో ఛాన్స్..ఇటు తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు అవకాశం ఇవ్వడం..అసలు ఊహించకుండా జరిగిపోయాయి. పూరి జగన్నాద్ లాంటి దర్శకుడు సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో బింధు మాధవీ ఎవరినీ లెక్క చేయకుండా తయారైంది. దిల్ రాజు నిర్మాణంలో సినిమా, పూరి దర్శకత్వంలో సినిమా అవకాశాలు రావడంతో రెమ్యునరేషన్ లెక్కలేకుండా పెంచేసిందట.
అయితే, బింధు మాధవీ కలర్ తక్కువ. దానికితోడు బాగా యారగంట్..రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం..యాక్టింగ్ లో అంత పర్ఫెక్షన్ లేకపోవడం ఆమె కెరీర్ మొత్తం ఊహించని విధంగా తలకిందులైంది. లేదంటే అంత యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా టాలీవుడ్ మేకర్స్ కొంతకాలం మోసేవారు. అసలు టాలెంట్ కంటే ఎక్స్‌ట్రా టాలెంట్ ఎక్కువవడంతో ఈ బ్లాక్ బ్యూటీని తీసి పక్కన పెట్టారు.
మొత్తంగా బింధు మాధవి తెలుగులో ఎన్ని సినిమాలు చేసిందో కాస్త అటు ఇటుగా తమిళంలోనూ అన్ని సినిమాలు చేసింది. కానీ, ఎక్కడా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేదు. బడ్జెట్ లో తీసే సినిమాలకి ఫైనల్ ఆప్షన్ గా మిగిలింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ తో కెరీర్ ని ఎలాగోలా నెట్టుకొస్తుంది. అనుష్క మాదిరిగా మంచి మనస్తత్వం ఉంటే పూరి, దిల్ రాజు స్టార్ గా మార్చేవారు.