దర్శకుడు సీనియర్ వంశీకి, సీనియర్ హీరోయిన్ భానుప్రియకి మంచి అనుబంధం ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీనికి కారణం ఆయన తీసిన సినిమాలలో ఎకూవగా భానుప్రియకి అవకాశాలిచ్చారు. దర్శకుడిగా వంశీ తెరకెక్కించిన మొదటి సినిమా మంచు పల్లకి. ఈ సినిమా తర్వాత సితార తెరకెక్కించారు. భానుప్రియకి హీరోయిన్‌గా ఇది మొదటి సినిమా.
కళ్ళు పెద్దవిగా ఉంటాయని ఆయన రాసుకున్న కథకి ఆ కళ్ళు చాలా ముఖ్యమని ఏరికోరి భానుప్రియని వంశీ సెలెక్ట్ చేసుకున్నారు. సితార మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలోనే ఆమె అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు చిత్రాలు చేసింది. అలా వంశీ భానుప్రియకి తెలుగులో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాడు.
ఈ కారణంగా వంశీకి, భానుప్రియకి మధ్య ఏదో సంబంధం ఉందని మాట్లాడుకున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు-ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకోవడం అలాగే, నిర్మాత-హీరోయిన్ గురించి మాట్లాడుకోవడం కామన్. దీనికి కారణం కొన్ని వ్యక్తిగత రిలేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అలాంటి రిలేషన్ కి ఒప్పుకోకపోతే అవకాశాలు ఇవ్వని వారూ ఉన్నారు.
అలాగే, వంశీకి భానుప్రియకి ఓ బాండింగ్ ఉండేదని ప్రచారం జరిగింది. కొందరు నిజమనీ అంటుంటారు. కానీ, భానుప్రియ..ఆయన నాకు గురువు లాంటి వారని, నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి లైఫ్ ఇచ్చారు. కాబట్టి నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానని గర్వంగా చెప్తారు. భానుప్రియ సందర్భం వచ్చినప్పుడల్లా వంశీ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు.