టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న హీరోలు ఇండస్ట్రీలో ఉన్నా కానీ బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు వాళ్ళు దేనికి పనికిరారు అని చెప్పాలి .
అయితే కోట్ల ఆస్తి ఉన్న ..వరుసగా సినిమాలు హిట్ అవుతున్న .. బాలయ్య మాత్రం సగం సంతోషంగానే ఉన్నారట .. మిగతా సగం సంతోషం ఆయన చిరకాల కోరిక నెరవేర్తేనే వస్తుందట . మొదటి నుంచి బాలకృష్ణ మనవరాలను ఎత్తుకోవాలని ఆశగా ఉండిందట. బ్రాహ్మణికి ఒక కొడుకు.. తన రెండో కూతురు తేజస్వినికి ఒక కొడుకు ..అయితే ఎవరికో ఒకరికి మనవరాలు పుడితే ఎత్తుకోవాలి అని ..ఆడించాలి అని ఎంతో ఆశపడుతున్నారట .
ఇప్పటికీ దేవుడు ఆయన ఆ కోరిక తీర్చట్లేదు అంటూ బాధపడిపోతున్నాడు బాలయ్య . అంతేకాదు బాలయ్యకు మొదటి నుంచి ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం అందుకే తనకు మనవరాలు పుట్టాలి అని కోరుకుంటున్నారట. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయన కోరిక త్వరగా నెరవేరాలి అని కోరుకుంటున్నారు..!!