Newsముక్కు, మొహం తెలియని వ్యక్తికి బెంజ్ కార్ కొనిచ్చిన అనుష్క.. స్వీటీ...

ముక్కు, మొహం తెలియని వ్యక్తికి బెంజ్ కార్ కొనిచ్చిన అనుష్క.. స్వీటీ ది ఎంత గొప్ప మనసో..!

అనుష్క నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఆమె తన వ్యక్తిత్వంతో అంతకుమించిన ప్రశంసలు అందుకున్నారు స్వీటీ. స్వీటీ మనసు గురించి చెప్పాలంటే ఒక జార్జియా కారు డ్రైవర్ కథ చెబితే చాలు. ఆమెది ఎంత మంచి మనసో తెలుస్తుంది. అనుష్క ఒక తమిళ సినిమా షూటింగ్ టైంలో జార్జియా వెళ్లారు. అనుష్క జార్జియాలో ఉన్నంతకాలం ఆమెకు జాజా అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పేరిటేటర్ గా పనిచేశారు.

అయితే ఒకరోజు ఆ జాజా రాకుండా వేరే వ్యక్తి వచ్చాడట. అనుష్క తన మేనేజర్‌ని పిలిచి జాజాకి ఏమైంది ?అని అడిగారట. దానికి మేనేజర్ బదులిస్తూ జాజా తన కారుకి కట్టాల్సిన లోన్ అమౌంట్ కట్టలేదని.. దీంతో ఆ కంపెనీ వాళ్ళు ఆ కారుని తీసుకువెళ్లిపోయారు అని చెప్పాడట. వెంటనే అనుష్క జాజాను పిలిపించి ఒక షోరూంకు తీసుకువెళ్లి బెంజ్ కార్ కొని పెట్టారట. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఒక సినిమా పనిమీద అరుంధతి సినిమా నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి జార్జియా వెళ్లారు.

అక్కడ జాజా , శ్యాంప్రసాద్ రెడ్డికి కార్ డ్రైవర్ గా పనిచేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డిది హైదరాబాద్‌ అని.. ఆమె అనుష్కకు సన్నిహితుడు అని తెలియడంతో ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు అనుష్క తనకు చేసిన సాయం విషయాన్నీ ఆయనకు చెప్పారట. దీంతో శ్యాం ప్రసాద్ రెడ్డి షాక్ అయిపోయారు. ఆ విషయాన్ని ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి చెప్పేవరకు టాలీవుడ్‌లో ఎవరికీ తెలియదు. దీంతో అనుష్కది ఎంత మంచి మనసో తెలుస్తోంది. ఇక జాజా కుటుంబం కూడా అనుష్కని ఒక దేవతలా ఆరాధిస్తారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news