Newsక‌న్నీళ్లు పెట్టిస్తోన్న యాంక‌ర్ ఝాన్సీ పోస్ట్‌... ఇంత విషాద‌మా...!

క‌న్నీళ్లు పెట్టిస్తోన్న యాంక‌ర్ ఝాన్సీ పోస్ట్‌… ఇంత విషాద‌మా…!

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ పని చేయాలన్నా ఎక్కువగా మేనేజర్ల మీద ఆధారపడుతూ ఉంటారు. మేనేజర్లు వాళ్ళకే గైడ్ చేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళ కాల్ షీట్లు, సినిమాల రెమ్యూనరేషన్లు ఇలా అన్ని మేనేజర్లు చూసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఒక మంచి మేనేజర్ ఉంటే వాళ్ల కెరీర్ ఎంతో ఉజ్వ‌లంగా వెలిగిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా లేదా హీరోయిన్ అయినా మేనేజర్ ఓకే చెప్పాకే ఆయా ప్రాజెక్టులో బాగం అవుతూ ఉంటారు.

మేనేజర్లకు సెలబ్రిటీలకు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. తాజాగా యాంకర్ ఝాన్సీ కెరీర్ కు ఎంతో కీలకంగా వెన్నుముకగా నిలుస్తున్న మేనేజర్ శ్రీను గుండెపోటుతో మరణించారు. దీంతో యాంకర్ ఝాన్సీ చాలా ఎమోషనల్ అయింది. శ్రీను తన బలం అని.. తను ముద్దుగా శీను బాబు అని పిలుచుకుంటాన‌ని.. అతడే నాకు పెద్ద సపోర్టు సిస్టం, హెయిర్ స్టైలిస్ట్ గా జర్నీ ప్రారంభించిన అతడు నాకు వ్యక్తిగత సహాయకుడిగా మారాడని.. నా పనులు అన్నింటిని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తాడని
ఝాన్సీ తెలిపింది.

అతడు నన్ను ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంచాడు. నా బలం.. మంచివాడు, సహృదయుడు నా రిలీఫ్, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు.. అతడు నా పీఏ మాత్రమే కాదు నా కుటుంబ సభ్యుడు. నా తమ్ముడు కంటే ఎక్కువ.. నా కుటుంబానికి ఎంతో కావలసిన వాడు.. అంటూ ఝాన్సీ ఎమోషనల్ అయింది. 35 ఏళ్లకే గుండె పోటుతో మరణించాడు అంటే ఈ వార్త నన్ను ఎంతో బాధకు గురి చేసింది. మాటలు రావడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిది అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాన్సీ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పై సెలబ్రిటీలు ఝాన్సీ అభిమానులు స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో చాలామంది 30 – 35 సంవత్సరాలకే గుండెపోటుతో మృతి చెందుతున్నారు. మారిన జీవనశైలి ఇందుకు కారణం అని కూడా చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news