మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు సిని అభిమానులకు కూడా చాలా అభిమానం.. ఆ ఆ సినిమాతో తెలుగుతరకు పరిచయమైన ఈ అమ్మడు అక్కడ ప్రేమమ్ సినిమా తెలుగులో రీమేక్ కాగా అందులోను అలరించింది. తెలుగులో యంగ్ హీరోల సరసన సినిమాలు చేస్తూ వచ్చిన అనుపమ స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు కొట్టేయటంలో కాస్త వెనకబడింది. అయినా కెరీర్ కొనసాగిస్తోంది. తనకు అవకాశాలు రాకపోవటానికి కారణం తన లుక్స్ అని డిసైడ్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు స్లిమ్ గా మారి అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే అనుపమ ఇదివరకు లుక్‌నే ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆమె మేకోవర్ తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. గత ఏడాది కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాలతో హిట్ కొట్టిన అనుపమ త్వరలో రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే సిద్దు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలోని నటిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్న అనుపమ ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ యంగ్ హీరోలతో సినిమాలు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది.
సినిమాలతోనే కాదు వరుస పోటోషూట్లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్‌గా దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. కర్లీ హెయిర్ తో అనుపమని అలా చూస్తుంటే చూసే కొద్ది చూడాలనిపించేలా ఉంది.. దీపావళి దీపాల వెలుగుల్లో సాంప్రదాయ చీరకట్టుతో అందాలు వెదజల్లుతూ ఉంటే కుర్రాళ్ళు ఇక ఆగుతారా ? అనుపమ ఫోటోలు పదే పదే షేర్లు చేస్తున్నారు.. దీపావళి పండుగ రోజు పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అన్నంత అందంగా ఆమె కనిపిస్తోంది.
రవితేజతో చేస్తున్న ఈగల్, సిద్దుతూ చేస్తున్న టిల్లీ స్క్వేర్ రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. ఈ రెండు హిట్లు పడితే అనుపమకు టాలీవుడ్ లో మరో రెండు మూడేళ్లపాటు అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. ఆమెకు తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఏ అవకాశాన్ని వదలకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అలాగే అటు కన్నడలోనూ ఒక సినిమాలో నటిస్తోంది