సినిమా విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇంట్లో వాళ్ల సలహాలు, అభిప్రాయాలు తీసుకోవడమూ అంతే ముఖ్యం. తీసుకోవాలనుకోకపోయినా ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఇస్తూనే ఉంటారు. దివంగత గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అలాగే, బయట వారు ఇచ్చే సూచనలు తీసుకున్న సందర్భాలున్నాయి. ఇక ఆరోజు గనక మంచి పాట పాడి వస్తే సోదరి శైలజ తో కలిసి ఆ ఆనందాన్ని పంచుకుంటారు.
అలా మన సంగీత దర్శకుల ఇళ్ళలో కూడా అంతే. సత్యమూర్తి గారి కొడుకు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ కట్టి పాట పాడితే ఎంతో ఆనందిస్తారు. మణిశర్మ ఇప్పుడు కొడుకు మహతీ స్వరసాగర్ సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన అనుభవంతో ఎంతో విలువైన సూచనలు ఇస్తున్నారు. ఇలాగే, మన సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మ్యూజిక్ సెన్షేషన్ అయిన ఎస్ ఎస్ థమన్ కూడా ఇంట్లో వాళ్ళ నుంచి కొన్ని సలహాలు తీసుకుంటారట.
అంతేకాదు, ఆయనపై ఎప్పటి నుంచో కాపీ క్యాట్ అనే ముద్ర ఉంది. ఆయన ప్రతీ సినిమా రిలీజ్ అయ్యే సరికి సాంగ్స్ పరంగానో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగానో విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఏదో ఒక ఇతర సినిమాలో ఉన్న సాంగ్ ట్యూన్ ని థమన్ కాపీ కొట్టారని కామెంట్స్ చేస్తుంటారు. అయితే, ఇదే విషయాన్ని ఓ షోలో థమన్ ని నేరుగా అడిగితే, నేను కావాలని ట్యూన్స్ కాపీ చేయను. అనుకోకుండా అలా జరుగుతుందని తెలిపారు.
నేను ఏదైనా మిస్టేక్ చేస్తే బయట జనాలకంటే ఇంట్లో మా ఆవిడే తిట్టిపెడుతుందని ఒప్పుకున్నాడు. ఈ సాంగ్ మ్యూజిక్ కంపోజిషన్ అసలు బాగా లేదని మొహం మీదే తిట్టేస్తుందని ఓపెన్ గా చెప్పాడు. అవి బయటకి చెప్పకూడదు గానీ ఒక రేంజ్ బూతులే అంటూ నవ్వేశాడు. అంటే థమన్ వైఫ్ నిర్మొహమాటంగా తిడుతుందని ఒప్పుకున్నాడు థమన్.