సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. కొత్త ప్రొడ్యూసర్లు పుట్టుకొస్తున్నారు. కానీ ఎవర్ గ్రీన్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు డాక్టర్ డి రామానాయుడు గారి అబ్బాయి డి సురేష్ బాబు . సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . నిజాయితీకి మరో మారుపేరనే చెప్పాలి .
కాగా ఈయన ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాలు భారీ భారీ హిట్లయ్యాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కూడా అయ్యాయి . అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని సురేష్ బాబు తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు. ఎన్నో సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఈయన ఎంతోమంది హీరోలకు లైఫ్ కూడా ఇచ్చారు. అయితే తన సొంత కొడుకు అయినా రానా దగ్గుబాటితో ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయలేదు.
దానికి కారణం ఏంటా అన్న ప్రశ్న చాలాసార్లు ఇండస్ట్రీలో జనాల నుంచి ఎదురైంది . అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఏకంగా రానా దగ్గుబాటినే వాళ్ళ నాన్నగారిని డైరెక్ట్ గా అడిగేసారు . ‘నువ్వు ఎందుకు నేను చేసిన సినిమాలు ఒకటి కూడా ప్రొడ్యూస్ చేయవు..?” అంటూ ప్రశ్నించారు. దీంతో స్ట్రైట్ ఆన్సర్ ఇస్తూ రానా మైండ్ బ్లాక్ చేశాడు సురేష్ బాబు . “నాకు నీ మీద నమ్మకం లేదురా ..? నీ నటన మీద నాకు అస్సలు నమ్మకం లేదు..? అందుకే నీ సినిమాలను ప్రొడ్యూస్ చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసాడు”. దీంతో ఈ కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి..!!