కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా సినిమా లియో. విక్రమ్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులోనూ అటు సౌత్ ఇండియాలోనూ.. ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం విజయ్ – లోకేష్ కనగరాజ్ ఇంకా చెప్పాలంటే హీరో విజయ్ కంటే లోకేష్ కనగరాజ్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాపై అటు తమిళంతో పాటు తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఖైదీ విక్రమ్ మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో లోకేష్ సినిమాలకు తెలుగులోనూ మంచి అభిమానులు ఉన్నారు. అందుకే లియోపై ఇక్కడ కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షో కూడా పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు ట్విట్టర్లో మంచి స్పందన లభిస్తోంది. లోకేష్ మేకింగ్ అదిరిపోయింది అని చాలామంది చెబుతున్నారు. విజయ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనని ఎక్కువమంది చెబుతున్నారు. కొన్నిచోట్ల సాగదీతగా అనిపించినా.. ఓవరాల్ గా లోకేష్ కనగరాజ్ గత సినిమాల మాదిరిగానే లియో చాలా స్టైలిష్ గా సరికొత్తగా ఉందంటున్నారు. అయితే సంజయ్‌దత్, అర్జున్ లాంటి నటులను పూర్తిగా వాడుకోలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు 2.75 నుంచి 3 రేటింగ్ ఇస్తున్నారు.
ఫస్ట్ అఫ్ చాలా డీసెంట్ గా ఉంది.. చాక్లెట్ కాపీ సీన్ అదిరిపోయింది.. సెకండాఫ్ యావరేజ్.. అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం బాగుంది.. విక్రమ్ – ఖైదీ – మాస్టర్ సినిమాలతో పోలిస్తే లియో కాస్త తక్కువగానే అనిపిస్తుంది అంటున్నారు. అయితే విజయ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు.. యాక్షన్ సీన్లు అదిరిపోయాయి.. స్టోరీతో పాటు ఎమోషన్ సీన్లు కూడా బాగున్నాయని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా పూర్తి రివ్యూ వస్తే లియో జాతకం ఎంటో తేలిపోనుంది.