సంయుక్త మీనన్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైం లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . జనరల్ గా ఒక హీరోయిన్ ఒక సినిమా హిట్ పడితే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అయితే సంయుక్త విషయంలో అది పూర్తిగా మారిపోయింది . ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్లు .
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అందరి కళ్ళు తనపై పడేలా చేసుకునేసింది సంయుక్త మీనన్. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా సైలెంట్ అయిపోయింది . సంయుక్తమీనన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు . కొత్త సినిమాలకి కూడా కమిట్ అవ్వడం లేదు . దీంతో అభిమానులకు సంయుక్త మీనన్ పై కొత్త డౌట్లు వచ్చేస్తున్నాయి.
సినిమాలను ఆపేసిందా ..? లేదా ..? సంయుక్త తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేక తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు ఇండస్ట్రీలో ఓ బడా డైరెక్టర్ వల్లే సంయుక్తమీనన్ కి అవకాశాలు వచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు ఆ డైరెక్టర్ అవకాశాలు ఇవ్వలేదేమో ..? కొత్త బ్యూటి తగిల్లింది ఏమో..? అందుకే సైలెంట్ అయిందేమో..? అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!