Movies' బాహుబ‌లి ' సినిమాలో యంగ్ హీరో నితిన్ ఉన్నాడా.. ఇన్నాళ్ల‌కు...

‘ బాహుబ‌లి ‘ సినిమాలో యంగ్ హీరో నితిన్ ఉన్నాడా.. ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్ ( వీడియో)

టాలీవుడ్ ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ తన రెండో సినిమాగా యంగ్ హీరో నితిన్ తో కలిసి చేస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ శ్రీలీల‌ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టిన సినిమా యూనిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి టీజర్ ఆడియన్స్ ముందు తీసుకువచ్చారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే మారేడుమిల్లి అడుగుల్లో ప్రారంభమవుతుంది. నితిన్ గుబురు గడ్డం లుక్ తో కనిపిస్తాడు.. ఈ సినిమా పక్కా మాస్ మూవీ అనుకున్నారు.. అయితే దానికి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ అన్న క్లాస్ టైటిల్ పెట్టడంతో ప్రేక్షకుల్లో కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా టీజర్ తో లైన్ ఎలా ? ఉండబోతుంది అనేది రివిల్ చేశారు. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.. ఈ క్రమంలోనే టీజర్ లో హీరోయిన్ శ్రీలీల కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావు కదా అని వెటకారం చేయడంతో నితిన్ ఒక్కసారిగా ఫీల్ అవుతాడు. ఆ వెంటనే సంప‌త్‌రాజ్‌తో బాహుబలి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుల్లో నేను కూడా ఉన్నానని నితిన్ చెప్పటం ఫేస్ మార్ఫింగ్‌ చేసి నితిన్ ని బాహుబలిలో చూపించడం ఆడియన్స్ కు న‌వ్వు తెప్పిస్తుంది.

దర్శకుడు వంశి ఫన్ అండ్ మాస్ బేస్డ్ స్టోరీ నితిన్ కోసం తయారు చేసుకున్నట్టు కనిపిస్తోంది. టోటల్గా ఓ కామన్ ఆడియన్ కు కావలసిన మాస్ ఎంటర్టైనర్ తో నితిన్ ఈసారి వస్తున్నాడని అర్థం అయింది. హరీష్ జయరాజ్ సంగీతంలో ఇప్పటివరకు వచ్చిన పాటలు అయితే చాలా బాగున్నాయి. టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. టీజర్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా కనిపిస్తోంది. డిసెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాక వ‌క్కంతం వంశీ – నితిన్ ప్రస్తుతం ఇద్దరూ ప్లాపుల్లో ఉన్నారు. మరి ఈ సినిమాతో హిట్టు కొడ‌తారా ? లేదా అనేది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news