టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి పెద్ద యుద్ధం జరిగేలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఆరేడు సినిమాలు కట్టకట్టుకుని వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సినిమాలకు తోడు ఇప్పుడు మరో సినిమా కూడా లైన్లోకి వచ్చేసింది. అదే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్. సంక్రాంతి రేసులో ఇప్పటికే గుంటూరు కారం, హనుమాన్, రవితేజ ఈగిల్, ఫ్యామిలీ స్టార్, నాగార్జున నా సామిరంగా లైన్లో ఉన్నాయి.
మరి ఈ టైంలో డిసెంబర్లో రావాల్సిన వెంకటేష్ సైంధవ్‌ను ఎందుకు సడెన్‌గా ఎందుకు జనవరి 13న డేట్ వేశారు ? అసలేం జరిగింది.. అన్నదానిపై ఇండస్ట్రీలో చాలా చర్చ నడుస్తోంది. సైంధవ్ డేట్ డిసెంబర్ 22 అని ఎప్పుడో వేసుకున్నారు. అదే రోజు సలార్ డేట్ వేశారు. సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్‌ను చెప్పా పెట్టకుండా సలార్ ను సైంధవ్ డేట్‌కే వేయడంతో ఇక సైంధవ్‌కు అయితే సంక్రాంతి లేదా ఏ ఫిబ్రవరికో మాత్రమే ఆప్షన్ ఉంది.
ఫిబ్రవరి అన్‌సీజన్. అందుకే తెగించేసి సైంధవ్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 13న వేసేశారు. వెంకటేష్ సినిమాకు థియేటర్ల ఇబ్బంది ఉండదు. వాళ్ల థియేటర్లు వాళ్లకే ఉంటాయి. అటు మహేష్ గుంటూరు కారం, రవితేజ ఈగిల్, తేజ సజ్జా హనుమాన్ ఇలా ఎన్ని సినిమాలు ఉన్నా వెంకటేష్ సినిమా మేకర్స్‌కు, చివరకు వెంకీ అన్న సురేష్‌బాబు కూడా కోపం వచ్చే తమ సినిమాను సంక్రాంతి రేసులో దింపుతున్నట్టు డేట్ వేసేశారంటున్నారు.
వెంకటేష్ హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా బాగా వచ్చిందని టాక్ ? సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా సైంధవ్‌ను సంక్రాంతి రేసులో దింపడంతో సంక్రాంతి మరింత హీటెక్కింది.