తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించి అనేక సూపర్ డూపర్ హిట్లు సాధించిన ఏకైక సూపర్ స్టార్ లేడీ అమితాబచ్చన్ విజయశాంతి అని చెప్పాలి. అప్పటి స్టార్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలలో నటించి వారికి తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్న ఘనత విజయశాంతికే దక్కుతుంది. తన సినిమాలకు స్టార్స్ అక్కర్లేదని నిరూపించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ విజయశాంతి.
సినీరంగంలో ఎన్నో విజయాలు అందుకున్న విజయశాంతి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 45 సంవత్సరాల పూర్తయింది. అలాగే ఆమె నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నేటి భారతం సినిమా విడుదలై కూడా నేటికీ 40 ఏళ్లు పూర్తి కావడం విశేషం. విజయశాంతి జూన్ 24, 1966లో వరంగల్ లో జన్మించారు. ఆ తర్వాత ఆమె మద్రాసులో పెరిగారు. అప్పటికే విజయశాంతి పిన్ని అయిన విజయ లలిత కూడా అలనాటి తెలుగు సినిమా. నటి విజయశాంతి అసలు పేరు శాంతి.. తన పిన్ని పేరులోని విజయ లలిత పేరు నుంచి విజయను తీసుకున్నారు.
ఆమె ఏడవ సంవత్సరంలోనే బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా సూపర్ స్టార్ కృష్ణతో కిలాడీ కృష్ణుడు. ఈ సినిమాకు విజయనిర్మల దర్శకరాలు. ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు పరిమితం అయిన ఆమె ఆ తర్వాత తిరుగులేని స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆమె 1987లో మోటూరి శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
శ్రీనివాస్ ఆమెకు బాలకృష్ణ ద్వారా పరిచయం. కొన్నాళ్ల పాటు ఆమెకు మేనేజర్‌గా కూడా పనిచేశారు. ఇక శ్రీనివాస్‌కు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో బంధుత్వం ఉంది. ఆయన ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్‌రావుకు స్వయానా మేనళ్లుడు. అలాగే ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీతోనూ ఆయనకు బంధుత్వం ఉంది. ఇలా ఎన్టీఆర్ ఫ్యామిలీతో రెండు వైపులా విజయశాంతికి భర్త ద్వారా బంధుత్వం ఉంది.