మామూలుగానే సంక్రాంతికి ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే థియేటర్ల కోసం ఎలాంటి యుద్ధాలు జరుగుతుంటాయో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతికి ఇదే వార్ జరిగింది. ఇప్పుడు దసరాకు లియో, భగవంత్ కేసరి, నాగేశ్వరరావు సినిమాల కోసం మళ్లీ థియేటర్ల వార్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభాస్ సలార్ దెబ్బతో టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య వార్ మొదలవుతోంది.
ఇప్పుడు టాలీవుడ్లో ఇదో కొత్త గొడవలా ఉంది. టాలీవుడ్ లో ముందుగా వేసుకున్న లెక్క ప్రకారం నాని హాయ్ నాన్న మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ సలార్ దెబ్బతో అనుకున్న షెడ్యూల్ కంటే రెండు వారాల ముందుగా వస్తుంది. నాని హాయ్ నాన్న సినిమాకు శౌర్యువ్ దర్శకుడు. ఈ సినిమాతోనే శౌర్యువ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల చేయాలని నిర్ణయించారు.
కొద్దిగా రిలీజ్ అయిన టీజర్ లో విషయాన్ని ప్రకటించారు. అనుకోకుండా సెప్టెంబర్ 28న రావాల్సిన ప్రభాస్ సలార్ సినిమా క్రిస్మస్ బరిలో నిలిచింది. అప్పటికే ఆ స్లాట్‌లో ఉన్న సినిమాలు అన్ని చెల్లాచెదురు అయిపోయాయి. క్రిస్మస్ కే రావాల్సిన వెంకటేష్ సైంధవ సినిమా పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి వెళ్ళిపోయింది. నాని సినిమా ప్రీపోన్ అయ్యి రెండు వారాల ముందుగా రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు డిసెంబర్ 8వ తేదీ స్లాట్‌లో కొత్త పోటీ మొదలైంది. ఆల్రెడీ ఆ తేదీకి వరుణ్ ఆపరేషన్ వాలంటైన్ – నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాలను షెడ్యూల్ చేశారు.
ఈ రెండు సినిమాల నుంచి రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ఒక రోజు ముందుగా నాని హాయ్ నాన్న వస్తోంది. ఈ పోటీ చూస్తుంటే వారిని మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉండేలా ఉంది. అన్నట్టు విశ్వసి నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అదే తేదీకి రాబోతుంది. అయితే వరుణ్ – నితిన్ సినిమాలలో ఒక సినిమా డిసెంబర్ మొదటివారం నుంచి డ్రాప్ అయ్యేలా కనిపిస్తోంది.
అసలే ప్రభాస్ సలార్‌తో ఇచ్చిన దెబ్బతో టాలీవుడ్ అంతా గుర్రుగా ఉంది. ఇప్పుడు నాని తన సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్‌కు తీసుకు రావడంతో వరుణ్ తేజ్, నితిన్ తో పాటు ఈ సినిమా నిర్మాతల మధ్య కూడా కొత్త తలనొప్పులు, థియేటర్ల గొడవలు తప్పేలా లేవు.