Newsఆ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ సినిమా... మ‌రో భోళాశంక‌ర్ వ‌ద్దు బాబోయ్ అంటోన్న...

ఆ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ సినిమా… మ‌రో భోళాశంక‌ర్ వ‌ద్దు బాబోయ్ అంటోన్న ఫ్యాన్స్‌..!

ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు ఒకే చేశారు. తన పెద్ద కుమార్తె కొణిదెల సుష్మిత నిర్మాణంలో కురసాల కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కే సినిమా ఒకటి కాగా.. రెండోది బింబిసార దర్శకుడు మల్లిడ్డి వశిష్ట తెర‌కెక్కించే చిరంజీవి 157వ సినిమా. చిరు 157వ సినిమాగా తెరకెక్కుతున్న వశిష్ట సినిమా సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

చిరుకు జోడిగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి లైన‌ఫ్ లో ఇప్పుడు మరో దర్శకుడు మారుతి కూడా వచ్చి చేరాడు. మారుతి తన రీసెంట్ ఇంటర్వ్యూలో తాను చెప్పిన కథకు చిరంజీవి ఓకే చెప్పారని.. చిరంజీవి గారితో తన సినిమా ఉందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ తరహాలో ప్లాన్ చేశామని.. ఘరానా మొగుడు తరహాలో ఉంటుందని మారుతి రివీల్‌ చేశాడు. దీంతో మెగాస్టార్ క్రేజీ లైన‌ప్‌లో మారుతి ఉన్నాడని ఫిక్స్ అయింది.

అయితే ఇప్పుడు మారుతి ఈ విషయం చెప్పినప్పటి నుంచి మెగా అభిమానులు టెన్షన్ తో ఉన్నారు. మారుతికి కూడా ఇటీవల కాలంలో సరైన హిట్లు లేవు. అసలు ప్రభాస్.. మారుతికి ఎందుకు ? ఛాన్స్‌ ఇచ్చాడు రా బాబు అని ప్రభాస్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మారుతికి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వటమే పెద్ద తప్పు అంటుంటే.. ఇప్పుడు ఏకంగా చిరంజీవి ఛాన్స్ ఇచ్చి మరో పెద్ద తప్పు చేశాడని మెగా అభిమానులు తలలు బాదుకుంటున్నారు.

అసలే భోలాశంకర్ సినిమాతో మెహర్ రమేష్ పెద్ద రాడ్ దింపేశాడు. ఇప్పుడు మారుతితో చిరంజీవి సినిమా చేసిన చిరంజీవి ఇమేజ్ను మారుతి బ్యాలెన్స్ చేయలేడ‌ని… మరో భోలాశంకర్ తప్పదని మెగా అభిమానులే ఫీల్ అవుతున్నారు. మరి చిరు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news