తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ కొందరి లైఫ్ లో పువ్వులు పూయిస్తే.. మరికొందరు లైఫ్ లో మంట పెట్టింది ..ఎక్కువ శాతం మంట పెట్టిందనే చెప్పాలి .. చాలామంది బిగ్ బాస్ లోకి వస్తే తమ లైఫ్ మారిపోతుందని .. తమ ఫేట్ తిరగరాసి పోతుంది అంటూ చెప్పుకుంటూ ఉంటారు . దానికోసం హౌస్ లోకి వెళ్లడానికి నానాదంటాలు పడుతుంటారు . వన్స్ హౌస్ లోకి వెళ్లి వచ్చామా అసలు నిజం బయటపడిపోతుంది .
తమకున్న ఫేం పెరుగుతుందో తగ్గుతుందో పక్కన పెడితే జనాలు చేత మాత్రం కచ్చితంగా బూతులు తిట్టించుకునేలానే ఉంటుంది. రీసెంట్ గా అదే విషయాన్ని బయట పెట్టాడు వరుణ్ సందేశ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ సందేశ్ పలు సినిమాల ద్వారా పాపులారిటి దక్కించుకున్నాడు . ఇలాంటి క్రమంలోనే ఆయన తన భార్యతో కలిసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ చాలా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు.
కానీ ఆయన భార్య వితికా మాత్రం జనాలు చేత బూతులు తిట్టించుకునింది . రీజన్ ఏంటో తెలియదు కానీ వరుణ్ కి వితికా సరైన జోడి కాదు అంటూ తెగ ట్రోల్ చేశారు . అంతేకాదు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న సరే ఆమెను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు . రీసెంట్ ఇంటర్వ్యూలో వరుణ్ మాట్లాడుతూ వితికను చాలామంది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఏడిపించారని.. నోటితో చెప్పలేని విధంగా ఆమెపై కామెంట్ చేశారని ..అయినా సరే వితికా వాటిని భరించిందని .. స్ట్రాంగ్ లేడీ అని చెప్పుకొచ్చారు . అసలు బిగ్ బాస్ కి వెళ్లడం వల్లే ఆమె ఈ రేంజ్ లో జనాలు చేత బూతులు తిట్టించుకుంది అన్న ఒపీనియన్ ని చెప్పకనే చెప్పేసాడు . దీంతో వరుణ్ మాటలు వైరల్ గా మారాయి..!!