పవన్ కళ్యాణ్ .. ఈ పేరు చెబుతూ ఉంటేనే ఓ తెలియని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఆయన ఫ్యాన్స్ ఓ దేవుడిలా భావిస్తూ ఉంటారు . ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరు చెబుతూ ఉంటేనే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . మరి అలాంటి పవన్ కళ్యాణ్ లైఫ్ లో మోస్ట్ స్పెషల్ డే ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారా..? పవన్ మర్చిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ విషయాన్ని మర్చిపోరు .
నేడు పవన్ కళ్యాణ్ లైఫ్ లోనే ఎంతో మెమొరబుల్ డే. సో సో స్పెషల్ అనే చెప్పాలి . మరీ ముఖ్యంగా అభిమానులకి ఈరోజు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది . ఇంతకీ ఈరోజుకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? సరిగ్గా ఇదే రోజున ఆయన ఫస్ట్ నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ అయింది . ఈ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది.
అంతేకాదు అప్పటివరకు పవన్ కళ్యాణ్ గా ఉన్న ఆయనను పవర్ స్టార్ చేసింది . అందుకే పవర్ స్టార్ అభిమానులు ఈరోజును పవనిజం డే గా అభివర్ణిస్తూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకి లేదని చెప్పుకోవడంలో సందేహం లేదు . ప్రజెంట్ సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు . అంతే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈరోజు ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు..1000 జన్మలు ఎత్తిన తీర్చుకోలేని రుణం తీర్చుకోలేం అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!