నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యు మూవీ కోసం గత ఐదారు సంవత్సరాలుగా తెలుగు సినీ అభిమానులు అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అదిగో పులి.. ఇదిగో మేక.. అన్న చందంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి.. తప్ప ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ప్రకటన రాలేదు. బాలయ్య మాత్రం ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని.. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తొలి సినిమా రిలీజ్ అవుతుందని చేసిన ప్రకటన మాత్రం కాస్త అభిమానుల్లో ఆసక్తిని రేపింది.
తొలి సినిమా ఎవరి బ్యానర్‌లో ఉంటుంది..? ఈ సినిమాకు ఎవరు దర్శకుడు ? అన్నది కూడా సహజంగానే ఆసక్తి రేపుతుంది. అయితే బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు ఎప్పుడో ? అడ్వాన్స్ ఇచ్చాడు. బాలయ్య కూడా సాయి కొర్రపాటికి మోక్షజ్ఞతో ఓ సినిమా చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే అది తొలి సినిమా అవుతుందా మలి సినిమా అవుతుందా అన్నది ? క్లారిటీ లేదు. ఇక మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీ కోసం చాలామంది డైరెక్టర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.
అప్పుడెప్పుడో ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా ఉంటుందని.. సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపించింది. పూరీ జగన్నాథ్ టాలీవుడ్ వారసులను చాలా గ్రాండ్గా వెండితెరకు లాంచ్ చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది.
ఇక తాజాగా బాలయ్యకు భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శికుడు అనిల్ రావిపూడి పేరు కూడా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మొదలుపెట్టి తాజాగా భగవంత్ కేసరి సినిమా వరకు ఏడు వరస సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ టైంలో అనిల్ వర్క్ నచ్చిన బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఇంట్రి బాధ్యతలను అనిల్‌కి అప్పగించాలని చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రెండు మూడు లైన్లు కూడా అనిల్ బాలయ్యకు చెప్పారని సమాచారం అందుతుంది. బాలయ్యకు దర్శకుడు అనిల్ మీద బాగా గురి కుదిరిందని కూడా అంటున్నారు. మరి బాలయ్య అనిల్ తో కమిట్ అవుతాడా లేదా పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను లేదా మరో డైరెక్టర్ పేర్లు పరిశీలిస్తారా.. అన్నది ఒకటి రెండు నెలల్లో అయితే క్లారిటీ వచ్చేయనుంది. ఏది ఏమైనా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా టాప్ డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుందన్నది వాస్తవం.