నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న షైన్ స్క్రీన్ సంస్థ ఇప్పుడు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాతో మొదటిసారి బిగ్ సక్సెస్ చూసింది. నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరోతో అవకాశం రావడంతో ఎక్కడ వెనక్కు తగ్గకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మించారు దర్శకుడు అనిల్ రావిపూడి. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను ఎలివేట్ చేసి ఆడియన్స్‌ను మెప్పించారు.
దసరాకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు బాలయ్య వరుసగా ఆఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. దీనిని నిలబెడుతూ భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయ్యి బాలయ్యకు వరుసగా మూడో హిట్ ఇచ్చింది. దసరా సెలవులు రావడంతో భగవంత్ కేసరి బాగా క్యాష్ చేస్తుంది. దీనికి తోడు ఈ సినిమాకి పోటీగా వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు, తమిళ్ హీరో విజయ్ లియో సినిమాలు అంచనాలు అందుకోలేదు.
దీంతో బాక్సాఫీస్ దగ్గర భగవంత్ కేసరి సినిమాకు ఎదురు లేకుండా పోయింది. క్లీన్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే మేజర్ ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి లాభాల్లోకి వచ్చేసింది. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, హైదరాబాద్ లాంటి ఏరియాలలో బాలయ్య మరోసారి బ్రేకింగ్ సాధించి తన మాస్ పంజా నిరూపించారు. నెల్లూరులో మరో రూ.10 లక్షలు వస్తే అక్కడ కూడా ఈ సినిమా టార్గెట్ పూర్తయినట్టే. ఈస్ట్, వెస్ట్ లో కూడా బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉంది.
భగవంత్ కేసరి 11 రోజుల వరల్డ్ వైడ్ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజం – రూ.16.66 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.5.83 కోట్లు
సీడెడ్ – రూ.13 కోట్లు
నెల్లూరు – రూ.2.26 కోట్లు
ఈస్ట్ – రూ.3.09 కోట్లు
వెస్ట్ – రూ.2.64 కోట్లు
గుంటూరు – రూ.5.57 కోట్లు
కర్ణాటక – రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.5.13 కోట్లు
ఓవర్సీస్ – రూ.7.96 కోట్లు
11 రోజుల వరల్డ్ వైడ్ షేర్ రూ.65.40 కోట్లు
11 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.130 కోట్లు
భగవంత్ కేసరి సినిమాకు మరో రెండు వారాలపాటు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో అన్ని ఏరియాలోను ఈ సినిమా భారీ లాభాలు ఆర్జించనుంది.