మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. నాలుగు దశాబ్దాల తన నటన ప్రస్థానంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు వయసు మీద పడ్డాక కూడా తన వయసుకు తగిన పాత్రలలో నటిస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ సౌత్ లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి మమ్ముట్టి పెళ్లయి, పిల్లలు ఉన్నాక కూడా ఒక స్టార్ హీరోయిన్ ప్రేమలో పడి ఆమెను రెండో భార్యగా చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు.
అప్పట్లో ఇది ఒక సెన్సేషన్.. ఆమె ఎవరో కాదు ఊర్వశి ..ఒకప్పుడు ఊర్వశి మలయాళ , తమిళ, తెలుగు భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. అయితే ఆమెకు వచ్చిన స్టార్ డంను ఎన్నో రోజులు నిలుపుకోలేదు. దీంతో పెళ్లి అయ్యాక కొన్ని కారణాల వల్ల ఆమె మద్యపానానికి బాగా బానిస అయ్యారు. ఊర్వశి, మమ్ముట్టి కలిసి దాదాపు 70కు పైగా సినిమాలలో నటించారు. ఆ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందని అంటారు. అయితే ఊర్వశి , మమ్ముట్టి ప్రేమను పట్టించుకోకుండా మరో నటుడు మోహన్‌లాల్ తో కూడా చనువుగా ఉండేదట.
ఊర్వశి మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న ముమ్ముట్టి తన భార్యకు విడాకులు ఇచ్చి ఊర్వశిని రెండో భార్యను చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారట. అయితే మోహన్ లాల్ తో ఊర్వశి చనువుగా ఉండటం మమ్ముట్టి హృదయాన్ని గాయపరిచిందట. ఆ తర్వాత మోహన్ లాల్ కూడా ఊర్వశికి హ్యాండ్ ఇచ్చాడు .దీంతో ఆమె మరో నటుడుని పెళ్లి చేసుకున్నా ఆ బంధం కూడా ఎక్కువ కాలం ఉండలేదు. అతనికి కూడా ఊర్వశి విడాకులు ఇచ్చేసింది. ఇక ఊర్వశికి ఆ తర్వాత మలయాళంలో ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో తమిళ్, తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు.