News4 గురు సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్యే ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1... 100...

4 గురు సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్యే ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1… 100 % నిజం..!

దసరా పండుగ కానుకగా విడుదలైన సినిమాలలో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా బాలయ్య భగవంత్‌ కేసరి. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో పోల్చి చూస్తే తమిళ డబ్బింగ్ సినిమా లియో – టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కాస్త రైసులో వెనుక పడ్డాయని చెప్పాలి. సినిమాకు ముందు నుంచి భారీ హైప్‌ ఉంది. బాలయ్య రెండు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉండడంతో పాటు అనిల్ రావిపూడి దర్శకుడు కావడం.. కాజల్, శ్రీలీల‌ లాంటి క్రేజీ హీరోయిన్లు.. తమను మ్యూజిక్ ఇవన్నీ సినిమాకు మంచి హైప్‌ పెంచాయి.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో గత 40 సంవత్సరాల నుంచి నలుగురు సీనియర్ హీరోలు కెరీర్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ గత కొన్ని యేళ్లుగా పోటాపోటీగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నలుగురు హీరోలలో ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? ఎవరు నెంబర్ వన్ అన్నది ? ఒక్కసారి సరిపోల్చి చూస్తే బాలయ్య పేరే ప్రథమంగా వినిపిస్తుం.ది ఈ రేసు నుంచి నాగార్జున నిజానికి ఎప్పుడో అవుట్ అయిపోయారు.

నాగార్జున సోలోగా హిట్ కొట్టి కొన్నేళ్లు దాటుతోంది. అసలు నాగార్జున సినిమాలు వస్తున్నాయి అంటే అక్కినేని అభిమానులు కూడా పట్టించుకోవడం లేదు. నాగార్జున మాత్రమే కాదు నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య సినిమాల పరిస్థితి కూడా అంతే గోరంగా ఉంటుంది. వెంకటేష్ మాత్రం తన ఇమేజ్‌కు తగినట్టుగా కథలు ఎంచుకుంటూ చిన్న చిన్న బడ్జెట్ తో సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇటీవల వెంకటేష్ పక్కా కమర్షియల్ సినిమాలలో నటించి చాలా రోజులు అయిపోయింది. ఇక మిగిలిన ఇద్దరిలో చిరంజీవి – బాలకృష్ణ మధ్య పోటీ నడుస్తూ వస్తోంది.

చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో హిట్ కొట్టారు. ఆ సినిమా రీమేక్‌. అయితే ఇటీవల చిరంజీవి నటించిన సినిమాలలో గాడ్ ఫాదర్, భోళాశంకర్, ఆచార్య, సైరా డిజాస్టర్లు అయ్యాయి. ఒక్క వాల్తేరు వీర‌య్య‌ సినిమా మాత్రమే హిట్ అయింది. బాలయ్య ఇటీవల కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణితో సూపర్ హిట్ కొట్టారు. ఇక అఖండ – వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య అమాంతం పెరిగిపోయింది. ఇటు బుల్లితెరపై టాక్ షో తో దూసుకుపోతున్నారు.

అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా బాలయ్య మ్యూజిక్ మామూలుగా వర్కౌట్ కావడం లేదు. యావరేజ్ కంటెంట్ తో వచ్చిన వీరసింహారెడ్డి లాంటి సినిమాలే సూపర్ హిట్ అయినాఆ అఖండను మించిన కలెక్షన్లు కొల్లగొట్టాయి. భగవంత్‌ కేసరి సినిమా కూడా యావరేజ్‌ కంటెంట్తో వచ్చిన బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇటీవల బాలయ్యకు ప్లాప్ అన్నదే లేదు. పైగా బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ విషయంలో చిరంజీవి పూర్తిగా వెనుకబడి పోయారు.

తమిళం, మ‌ళ‌యాళంలో ఎప్పుడో వచ్చిన మూస సినిమాల రీమేక్‌ల‌లో నటిస్తూ తన స్థాయిని తానే తగ్గించేసుకుంటున్నారన్న ఆవేదన మెగా అభిమానుల లోనే ఉంది. ఏది ఏమైనా బాలయ్య ఇతర భాషలలో సైతం అడుగు పెడితే ఆయనకు ఇప్పట్లో తిరుగే ఉండదని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ప్రస్తుతం బాలయ్య హ‌వా నడుస్తోంది. బాలయ్య ఎదురులేకుండా దూసుకుపోతున్నారని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news