కన్నడ నటి సంఘవి టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన విషయం లేదు. ఆమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించారు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్ మహల్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంఘవి ఆ తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు సింధూరం, నాయుడు గారి కుటుంబం, సూర్యవంశం, సరదా బుల్లోడు, సమరసింహారెడ్డి ,సీతారామరాజు లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
సంఘవి కోలీవుడ్ లోనూ చాలా సినిమాలు చేశారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా ఆసక్తికర విషయాలే ఉన్నాయి .తమిళంలో దళపతి విజయ్ సరసన నటించిన తొలి సినిమా సూపర్ హిట్ అయింది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ .. సంఘవిని హీరోయిన్ పెట్టి విజయ్ హీరోగా ఒక సినిమా డైరెక్టర్ చేశారు. ఆ తర్వాత సంఘవి – విజయ్ కాంబినేషన్లో మరో మూడు నాలుగు సినిమాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు కూడా ..: అది నచ్చని విజయ్ తండ్రి సంఘవికి కోలీవుడ్లో అవకాశాలు లేకుండా చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమెను టాలీవుడ్ అక్కున చేర్చుకుంది. ఇక్కడ స్టార్ హీరోల సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలుగులో శివయ్య సినిమా దర్శకుడు సురేష్ వర్మతో ప్రేమలో పడి 2000లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి సంఘవి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. సంఘవి కుటుంబ సభ్యులను ఎదిరించి మరి హైదరాబాద్ వచ్చేసి సురేష్ వర్మతో కాపురం పెట్టింది.
ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గటం.. సురేష్ వర్మతో విభేదాలు రావడంతో ఇద్దరు విడాకులతో వేరయ్యారు. కేవలం సురేష్ వర్మ టార్చర్ కారణంగానే సంఘవి అతడికి విడాకులు ఇచ్చేసిందని అంటారు. ఆ తర్వాత సంఘవి తల్లిదండ్రులు ఆమెకు ఎన్నారై సంబంధం చూసినా.. ఆమె ఆ వివాహం కూడా చేసుకోలేదు. బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థల అధినేత వెంకటేషన్ ని 2016 లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు మైసూర్ లో స్థిరపడ్డారు. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లి అయిన సంఘవి తెలుగులో రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.