ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు . ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ తర్వాత తారక్ నటిస్తున్న బిగ్ ప్రాజెక్టు కావడంతో అభిమానుల సైతం హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాం అంటూ అఫీషియల్ ప్రకటన చేశారు .
అప్పటివరకు ఎన్టీఆర్ దేవర ఒక పార్ట్ గానే రాబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయిన జనాలకు ఇది నిజంగా బిగ్ షాకింగ్ న్యూస్ గానే మారిపోయింది. అయితే ఎన్టీఆర్ దేవర రెండు భాగాలుగా తెరకెక్కించే అంత కంటెంట్ కొరటాల దగ్గర ఉందా..? లేకపోతే ఎన్టీఆర్ ని ఇరకాటంలో పెట్టేస్తున్నారా ..? అంటూ కూడా ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఎన్టీఆర్ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కించమని ఐడియా కొరటాలకి రాలేదు ..ఎన్టీఆర్ కి రాలేదు ..స్టార్ హీరోకి వచ్చింది.
ఆ స్టార్ హీరో సజెషన్ మేరకే ఎన్టీఆర్ కొరటాలకు ఇలాంటి ఓ ఐడియా ఇచ్చారు. ఆ హీరో మరెవరో కాదు బన్నీ. ఎన్టీఆర్ ను బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకునే బన్నీ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కించమంటూ సజెస్ట్ చేశారట. పార్ట్ వన్ అటు ఇటు అయిన పార్ట్ 2 ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.. కలెక్షన్స్ వస్తాయి అంటూ ధీమాని కలిగించారట . పుష్పని కూడా అదే స్ట్రాటజీతో రెండు భాగాలుగా తెరకెక్కించామన్న టాప్ సీక్రేట్ ని రివిల్ చేశారట . దీంతో కొరటాల సైతం బన్నీ ఆలోచనలను మెచ్చుకొని దేవర ను రెండు భాగాలుగా తెరకెక్కించడానికి యాక్సెప్ట్ చేశారట . ఫైనల్లీ బన్నీ ఇచ్చిన సలహాతో దేవర రెండు భాగాలుగా మన ముందుకు రాబోతుంది. చూద్దాం ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్ధలు కొడుతుందో..?