Newsబాల‌య్య ' భ‌గ‌వంత్ కేస‌రి ' లో ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్...

బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ లో ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ రీమిక్స్‌… థియేట‌ర్ల‌లో దంచుడే..!

బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా భగవంత్‌ కేసరి. దసరా కానుకగా ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్ అయితే అదిరిపోయాయి. సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక ఎత్తు.. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు ఒక ఎత్తు అన్నట్టుగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ట్విష్ఠులు కూడా ఉన్నాయి. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది.

ఇదే అదిరిపోయే ట్విస్ట్‌ అనుకుంటే.. ఇప్పుడు బాలయ్య ఎవర్గ్రీన్ హిట్ దంచవే మేనత్త కూతురా పాటను కూడా రీమిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పటివరకు అఫీషియల్ గా చెప్పలేదు. అయితే సినిమా షూటింగ్ మొత్తం అయ్యాక ఈ పాటను రీమిక్స్ చేశారట. అయితే ఇప్పుడు ఈ పాట ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలో ? అని తర్జనభర్జనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

19న రిలీజ్ అయ్యే కాపీలో ఈ సాంగ్ ఉండదని తెలుస్తోంది. దసరా పండుగ రోజున ఈ పాటను సినిమాకు యాడ్ చేస్తారని సమాచారం. ఈ పాట సినిమాలో ఎక్కడ పెడదామన్నా ప్లేస్‌మెంట్‌ సెట్ కావడం లేదట. క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్ లో మాత్రమే సెట్ అవుతుందట. అయితే క‌థ‌ సీరియస్ టోన్ లో నడిచే టైంలో ఆ పాట పెట్టి ఆడియన్స్ మూడ్ సైడ్ ట్రాక్ లోకి తీసుకు వెళ్ళటం ఎడిటర్, దర్శకుడు కి ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది.

అందుకే ముందు సినిమాను అనుకున్నట్టు ఇంటెన్స్ సిరియస్ టోన్‌లో విడుదల చేసి.. దసరా కానుకగా ఆ పాట‌ను యాడ్ చేసి అభిమానులకు.. ప్రేక్షకులకు కానుకగా అందించాలని దర్శకుడు అనిల్ రావిపూడి డిసైడ్ అయిపోయాడట. ఏది ఏమైనా మంగమ్మగారి మనవడు సినిమాలో దంచవే మేనత్త కూతురా లాంటి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్‌ను ఇన్నాళ్లకు మళ్ళీ అదే బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. మరి ఈసారి బాలయ్య ఈ రీమిక్స్ సాంగ్ తో థియేటర్లను ఎలా దంచుతారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news