Newsనాని - అంజ‌న ప్రేమ పెళ్లిలో అదే అస‌లు హైలెట్‌.. సూప‌ర్...

నాని – అంజ‌న ప్రేమ పెళ్లిలో అదే అస‌లు హైలెట్‌.. సూప‌ర్ ట్విస్ట్ క‌దా..!

టాలీవుడ్ క్రేజీ హీరో నేచురల్ స్టార్ నాని సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. టాలీవుడ్‌లో నాని సినిమా వస్తోంది అంటే చాలు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎదురుచూస్తూ ఉంటుంది. నాని సినిమాలు అంటే ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు మినిమం గ్యారంటీ సినిమాలు. ఇక నాని – అంజనను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని – అంజన వివాహ బంధంలో అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నాని తన సతీమణి అంజన ఎలవర్తికి నుదుటిపై కుంకుమ పెడుతూ పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ బ్యూటిఫుల్ పోస్టును నాని సోషల్ మీడియాలో షేర్ చేయగా నాని అభిమానులతో పాటు.. టాలీవుడ్ అభిమానులు.. నాని దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాని పూజ గదిలో తన భార్య అంజన నుదుట కుంకుమ పెడుతూ ఉన్న ఈ ఫోటో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వీరిద్దరి వైవాహిక జీవితం ఎంత అన్యోన్యంగా ఉందో చెప్పేందుకు ఈ ఫోటో నిదర్శనం అనుకోవాలి. ఇక నాని దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే నాని – అంజన ప్రేమ ఎక్కడ, ఎలా ? చిగురించింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్. నాని సినిమాలోకి రాకముందు వైజాగ్ లో ఆర్జేగా వర్క్ చేశాడు. ఆ సమయంలో అంజనను తొలిసారి కలిశాడట.
కొద్ది సమయంలోనే వీరిద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. ఐదేళ్లపాటు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. అంజ‌నా తన భర్త నానిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.

ఇక హాట్ బ్యూటీ శ్రీరెడ్డి నానిపై తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు నాని వ్యక్తిగతంగాను అటు వైవాహిక బంధం లోను ఎంతో డిస్టబెన్స్‌కు గురయ్యాడు. ఆ టైంలో కూడా అంజన తన భర్తకు సపోర్టుగా నిలవడంతో పాటు శ్రీ రెడ్డిపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక నాని సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నటించిన హాయ్ నాన్న‌ సినిమా డిసెంబర్ తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news