Newsవావ్‌: ఫ్యీజులు ఎగిరే న్యూస్‌... ఆ స్టార్ హీరోతో జూనియ‌ర్...

వావ్‌: ఫ్యీజులు ఎగిరే న్యూస్‌… ఆ స్టార్ హీరోతో జూనియ‌ర్ ఎన్టీఆర్ మూడో మ‌ల్టీస్టార‌ర్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నెగ‌టివ్ రోల్ ద్వారా కనిపించబోతున్నాడని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర టెర్రరిస్టు నాయకుడిగా ఇండియాని గడగడలాడించేలా ఉండబోతుందని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు వార్ 2 వరుసగా రెండు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్న ఎన్టీఆర్ వెంటనే మరో మల్టీ స్టార్లర్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ టైగర్ 3 సినిమాలో నటించబోతున్నాడట. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని… ఈ పాత్ర‌కు కొన‌సాగింపుగానే వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది.ఇక వార్ 2 సినిమా షూటింగ్ డిసెంబర్ లేదా జనవరి నుంచి ఉండబోతోంది. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా.. అది కూడా టైగర్ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడుంటే అంతకుమించిన గొప్ప రీచ్ మరొకటి ఉండదని చెప్పాలి.

వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత నీల్‌ కాంబినేషన్ ఉంటే అది కూడా నార్త్ ఇండియాలో ఈ సినిమా మార్కెట్‌కు చాలా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఆరు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి కొత్త షెడ్యూల్లోకి ఎంటర్ కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news