హాలీవుడ్ స్టార్ హీరో విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ తెరకెక్కిన లియో సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను చూసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా ద్వారా తన రివ్యూ పంచుకున్నారు. లియో సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న సందేహాలకు సైతం ఆయన చెక్ పెట్టారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లియో సినిమా భాగమే అని తన కామెంట్లో చెప్పేశారు. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా కాదా ? అన్న సందేహాలకు ఉదయనిధి చెక్ పెట్టేసినట్లయింది. లియో సినిమా సూపర్బ్ గా ఉందని.. విజయ్ యాక్టింగ్ యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పేశారు. అన్భరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ అమేజింగ్ అని ఉదయనిధి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సినిమా నిర్మాతలు అయిన 7 స్క్రీన్స్ స్టూడియోస్‌తో పాటు లియో సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉదయనిధి స్టాలిన్ సినిమా గురించి పూర్తి పాజిటివ్ గా చెప్పటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక సినిమాలో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే లియో సినిమాకు తెలుగులోను బుకింగ్స్ అదిరిపోతున్నాయి.
ఇక్కడ స్ట్రైట్ సినిమాలో భగవంత్ కేసరి – టైగర్ నాగేశ్వరరావుతో ఇంకా చెప్పాలంటే టైగర్ నాగేశ్వరరావు కంటే లియోకే ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీనిని బట్టి తెలుగులో కూడా ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఏదేమైనా లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ గట్టిగానే వర్కవుట్ అయినట్టుగా తెలుస్తోంది.