దివంగ అతిలోక అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు చాలా మంది హీరోలు గట్టిగా ట్రై చేశారు. ఎట్టకేలకు రెండు సంవత్సరాల తర్వాత ఆ అవకాశం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఆ మాటకు వస్తే సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే జాన్వీకి ఇది తొలి సినిమా కావటం విశేషం.
అయితే ఇప్పుడు మరో స్టార్ కి హీరోయిన్ కూతురిని కూడా టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. అయితే ఈసారి వంతు రామ్ చరణ్ తీసుకున్నాడు రామ్ చరణ్. చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రవీనాటాండన్ కూతురు రాషా తడానీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
రీసెంట్గా రాషాపై టెస్ట్ కట్ చేశాడు బుచ్చిబాబు. సినిమాలో తాను అనుకున్న పాత్రకు రాషా లుక్స్ సెట్ అయితే వెంటనే తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాషాతో పాటు మరికొంతమందిపై కూడా టెస్ట్ జరిగింది. ఈ సినిమాకు ఏఆర్. రెహ్మన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే రెహ్మన్‌తో దర్శకుడు బుచ్చిబాబు సానా జర్నీ కూడా స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఓ సాంగ్ లాక్ అయ్యింది. రఫ్ కూడా వచ్చేసిందని.. సాంగ్ బాగా కుదిరిందని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌చేంజర్ సినిమా చేస్తున్నాడు చరన్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.