Newsతార‌క్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం... న‌వంబ‌ర్ 18నే సినిమా రిలీజ్‌

తార‌క్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం… న‌వంబ‌ర్ 18నే సినిమా రిలీజ్‌

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అదుర్స్‌. 2010 సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇద్ద‌రూ క‌లిసి నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేయ‌గా… ఎన్టీఆర్‌కు జోడీగా న‌య‌న‌తార‌, షీలా న‌టించారు.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ స్వ‌రాలు అందించారు. ఎన్టీఆర్ ఓ ఆచారిగాను, ఇటు డాన్ పాత్ర‌లోనూ క‌నిపించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 ఏళ్లు అవుతోంది. అటు ఎన్టీఆర్ సినీ కెరీర్ కూడా 23 ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న సంద‌ర్భంగా ఈ అదుర్స్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ యేడాది ఇప్ప‌టికే ఎన్టీఆర్ న‌టించిన‌ సింహాద్రి, ఆంధ్రావాలా సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి త‌క్కువ టైంలోనే అదుర్స్‌ సినిమా రీ రిలీజ్ అవుతోంది. న‌వంబ‌ర్ 18న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్ర‌హ్మానందంతో పాటు ఎన్టీఆర్ చారీ క్యారెక్ట‌ర్‌లో వ‌చ్చే కామెడీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఏదేమైనా 13 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news