Newsబాల‌య్య‌కు జోడీగా మ‌హేష్‌బాబు హీరోయిన్‌... కుర్ర హీరోయిన్‌తో కేక పెట్టించే కాంబినేష‌న్‌..!

బాల‌య్య‌కు జోడీగా మ‌హేష్‌బాబు హీరోయిన్‌… కుర్ర హీరోయిన్‌తో కేక పెట్టించే కాంబినేష‌న్‌..!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత యంగ్‌ దర్శకుడు బాబీ – బాల‌య్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది..

ఈ సినిమా కూడా బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌, ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో ఉండేలా ద‌ర్శ‌కుడు బాబి క‌థ‌ను రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా హీరోయిన్‌గా ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న దానిపై బాబి క‌స‌ర‌త్తులు చేసి ఓ హీరోయిన్‌ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు మ‌హేష్ బాబు గుంటూరు కారం సినిమా హీరోయిన్ మీనాక్షి చౌద‌రి.

అస‌లు బాలయ్య బాబు – మీనాక్షి చౌదరి కాంబినేషన్ అంటే ఏ రేంజ్‌లో అదిరిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు. కుర్ర హీరోయిన్‌తో బాల‌య్య రొమాన్స్‌… సాంగ్స్ అంటే మామూలు ర‌చ్చ ఉండ‌దు. అయితే ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామాకు మంచి స్కోప్ ఉండ‌డంతో మీనాక్షిని తీసుకున్నార‌ట‌. అలాగే ఈ సినిమాలో పొలిటిక‌ల్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంద‌ట‌.

ఇక బాల‌య్య త‌న‌కు అల‌వాటైన‌ట్టుగానే డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు. బాల‌య్య – మీనాక్షి చౌద‌రి కాంబినేష‌న్ అంటే ఖ‌చ్చితంగా కుర్రాళ్లు, యూత్‌లో మాంచి క్రేజీ కాంబినేష‌న్ అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news