తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో అక్క, పిన్ని, వదిన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆమె ఇటీవల కాలంలో సినిమాలలో నటించడం పూర్తిగా తగ్గించారు. ఆమెకు ఛాన్సులు రాక సినిమాలకు దూరంగా ఉంటున్నారా ? లేదా పూర్తిగా సినిమాలు కు దూరం అవుతున్నారా ? అన్నది క్లారిటీ లేదు. అయితే సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.
కరోనా టైంలో అందరూ పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో సురేఖవాణి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కుమార్తె సుప్రీతతో కలిసి రిల్స్ చేస్తూ నానా రచ్చరచ్చ చేశారు. సోషల్ మీడియాలో పొట్టిపొట్టి దుస్తులు ధరించి ఆంటీ ఏజ్ ఉన్నా కూడా స్టార్ హీరోయిన్లకు పోటీగా అందాలు ఆరబోశారు. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎలా రచ్చ ? చేసిందో చూశాం.
పైగా అటు మద్యం సేవిస్తున్న ఫోటోలు కూడా చాలా నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో పంచుకోవడం ఈ తల్లి, కూతుర్లకే చెల్లింది. తాజాగా సురేష్ వాణి ఎరుపు రంగు చీర కట్టుకుని దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈమె మెడలో తాళి వేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సురేఖవాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో బాధపడుతూ 2019లో మృతిచెందారు. ఆ తర్వాత ఆమె కొద్ది రోజులకే ఆ బాధ నుంచి బయటకు వచ్చేసి మాంచి చిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె రెండో పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో ఆమె మెడలో తాళిబొట్టుతో దర్శనమివ్వడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందా ? ఏంటి అన్న సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.