News' దేవ‌ర ' లో జాన్వీతో పాటు సెకండ్ హీరోయిన్ కూడా......

‘ దేవ‌ర ‘ లో జాన్వీతో పాటు సెకండ్ హీరోయిన్ కూడా… ఆ ముద్దుగుమ్మ ఎవ‌రంటే..!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమా రెండు పార్టీలుగా వస్తున్నట్లు దర్శ‌కుడు కొరటాల ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీక‌పూర్ మ‌త్స‌కార కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా న‌టించ‌నుంద‌ట‌. అయితే జాన్వీక‌పూర్‌తో పాటు రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ పాత్ర కాకుండా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ పాత్ర‌కోసం కూడా కొర‌టాల నార్త్ ఇండియ‌న్ హీరోయిన్‌నే తీసుకునే ప్లానింగ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ సెకండ్ హీరోయిన్ పాత్ర‌కు దేవ‌ర 1లో రెండు, మూడు సీన్లు మాత్ర‌మే ఉంటాయ‌ట‌. దేవ‌ర 2లో ఈ పాత్ర కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news