టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీ లీల ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ అవుతోంది .పెళ్లి సందడి, ధమాకా తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రామ్ తో చేసిన స్కంద సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఇమే చేతిలో ఉన్న నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, మహేష్ బాబు గుంటూరు కారం – పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
శ్రీ లీల మంచి నటిగానే కాకుండా అలాగే మంచి డాన్సర్ గా కూడా ఈ విషయంలో తిరగలేదు. పైగా తను లక్కీ గర్ల్ కూడా..! ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్టు అయితే ఈ టాలెంటెడ్‌తో కుర్ర హీరోలకు చుక్కలు చూపిస్తుందట. అయితే అది తన నటనతో కావడం విశేషం. శ్రీలీలతో సినిమా అనగానే డ్యాన్స్ మాస్టర్లు శ్రీలీల కోసం అంటూ కొన్ని సిగ్నేచర్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారట. ఇదివరకు డాన్స్ మాస్టర్లు హీరోలను దృష్టిలో ఉంచుకుని డ్యాన్స్ కంపోజ్ చేసేవారు.. ఇప్పుడు వారంతా శ్రీలీల పైనే మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారట.
అసలే శ్రీలీలతో పాటంటే కళ్ళని ఆమె మీదే ఉంటాయి దీనికి తోడు ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లు ఆమె కోసం ప్రత్యేకంగా సిగ్నేచర్ స్టెప్పులు కంపోజ్ చేస్తూ ఉండడంతో ఇది కుర్ర హీరోలకు ఇబ్బందిగా మారిందట. తాజాగా ఆదికేశవ నుంచి ఓ పాట బయటికి వచ్చింది. పాట పేరు కూడా శ్రీలీల పేరు మీదే ఉంటుంది. లీలమ్మా అనే ఈ పాటలో కెమెరా ఫోకస్ అంతా వైష్ణవి తేజ్ కంటే శ్రీలీల మీదే ఉంది. పాట ఎలా ఉంది ? ట్యూన్ సంగతేంటి అనేది పక్కన పెడితే శ్రీలీల సిగ్నేచర్ స్టెప్పులు మాత్రం అదిరిపోయాయి..అసలు వైష్ణవ్ పక్కన శ్రీ లీల ఉండడంతో ఎవ్వరు వైష్ణవి తేజ్ గురించి పట్టించుకోవడం లేదు.
ఇంకా చెప్పాలి అంటే శ్రీలీల పక్కన వైష్ణవ్‌తేజ్ క్యారెక్టర్ ఆర్టిస్టులా కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ డాన్సర్ కాదా అంటే తను కూడా మంచి డ్యాన్సర్ ఏ..అయితే శ్రీలీల ముందు తేలిపోవడంతో ఒక సమస్య గా మారుతోంది. ఇది యంగ్ హీరోలు అందరి సమస్య అని చెప్పాలి.. స్కంద సినిమాలో కూడా రామ్ కంటే ఎనర్జీగా శ్రీలీల డ్యాన్సులు వేసింది. ఏది ఏమైనా హీరోలు డాన్సులతో ఆధిపత్యం చూపించాలనుకుంటారు.. శ్రీ లీల వారి ఆశలకు గండి కొట్టి తన డామినేషన్ పూర్తిగా చూపిస్తోంది.