ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ? అని అడిగితే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది శ్రీలీల. తొలి సినిమా సూపర్ హిట్.. ఆ తర్వాత రవితేజ కి జోడిగా చేసిన ధమాకా బ్లాక్ బస్టర్. రామ్‌తో చేసిన స్కంద ప్లాప్ అయినా పరవాలేదనిపించింది. ఇక దసరా కానుకగా వచ్చిన బాలయ్య భగవంత్ కేసరి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి దసరా విన్నర్ అయింది.
ఇక వచ్చే నెలలో మెగా హీరో వైష్ణవ తేజ్ ఆదికేశవ్ – డిసెంబర్లో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ – సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలతో ఆమె వరుసగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో డజనుకుగా పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆదికేశవ సినిమా నుంచి లేలమ్మా అంటూ రిలీజ్ అయిన పాటలో శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్ తో దంచికొట్టింది. ఇక ఆమె తన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాను నటిస్తున్న అందరి హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై ఆమె మాట్లాడుతూ పవన్ నాకు దైవంతో సమానం అంటూ సెంటిమెంట్ కామెంట్ చేసింది. పవన్ చుట్టూ ఉండే ఆరా చాలా ప్రత్యేకమైనది.. ఆయనను చూస్తే దేవుడిని చూసినా అనుభూతి కలుగుతుందని ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం కామెంట్స్ ను మెగా అభిమానులు.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శ్రీలీల ఇలా ప్రస్తుతం అందరూ స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్నా ఏ హీరో గురించి కూడా ఇంత గొప్పగా మాట్లాడలేదు.
అలాంటిది పవన్ కళ్యాణ్ దయ్యంతో పోల్చడం అంటే పవన్ కళ్యాణ్ కి ఆమె ఎంతలా కనెక్ట్ ? అయిందో అర్థం చేసుకోవచ్చు. పవన్ మీద శ్రీలీలకు మామూలు భక్తి కాదుగా అనుకోవాల్సిందే. శ్రీలీల ఇలా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.