Newsటాలీవుడ్‌లో ఒకేసారి ఇన్ని పెళ్లిళ్లా.... భార్య‌, భ‌ర్త‌ల‌వుతోంది వీళ్లే...!

టాలీవుడ్‌లో ఒకేసారి ఇన్ని పెళ్లిళ్లా…. భార్య‌, భ‌ర్త‌ల‌వుతోంది వీళ్లే…!

ఉన్నట్టుండి ఒక్కసారిగా సోషల్ మీడియా పెళ్లి ముచ్చట్లతో హోరెత్తిపోతోంది. కొంతమంది పెళ్లికి రెడీ అవుతుంటే మరి కొంతమంది తమ పెళ్లి ముచ్చట్లను తెరమీదకి తీసుకువస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆప్‌ ఎంపీ రాఘవ చ‌ద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె పెళ్లి త‌ర్వాత మాల్దీవుల్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఇటు సౌత్ ఇండియాలో కూడా సినిమా సెలబ్రిటీల‌ పెళ్లి ముచ్చట్లు బాగానే వినిపిస్తున్నాయి.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన రెండో కుమార్తె పెళ్లి ఖాయం చేశారు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ కూతురు ఎంగేజ్మెంట్ జరిగింది. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ఈ ఎంగేజ్మెంట్‌కు హాజరయ్యారు. ఇక సీనియర్ హీరోయిన్ అమలాపాల్ కూడా తన పెళ్లి విషయాన్ని బయట పెట్టింది. జగత్‌ దేశాయ్ అనే వ్యక్తితో ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది.

అమలాపాల్ కు ఇది రెండో పెళ్లి.. అంతకుముందు తమిళ దర్శకుడు ఏఎల్.విజయ్‌ను ఆమె పెళ్లాడింది. అయితే పెళ్లి అయిన రెండున్న‌రేళ్లకే విడాకులు తీసుకుంది. ఇక ఇదే లిస్టులో సీనియర్ హీరో అర్జున్ కూతురు కూడా ఉంది. అర్జున్ కూతురు ఐశ్వర్య.. కోలీవుడ్ నటుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారు. వీళ్ళ ప్రేమకు పెద్దల ఆమోదం కూడా లభించింది. మరికొద్ది రోజుల్లో అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి గుడిలో ఐశ్వర్య ఉమాపతి ఎంగేజ్మెంట్ జరగనుంది.

మెగా ఫ్యామిలీలో ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జ‌రిగింది. త్వ‌రలోనే వీరి పెళ్లి కూడా జ‌ర‌గ‌నుంది. ఇక మెగా ఫ్యామిలీలోనే మ‌రో పెళ్లి కూడా జ‌రిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు సిని సెల‌బ్రిటీల పెళ్లి వార్త‌ల‌తో సోష‌ల్ మీడియా హోరెత్తిపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news