Movies"కట్ చెప్పిన ఆ మూడ్ లోనే ఉండిపోయా".. శ్రీలీల అంత టెంప్ట్...

“కట్ చెప్పిన ఆ మూడ్ లోనే ఉండిపోయా”.. శ్రీలీల అంత టెంప్ట్ అయిపోయిందా..?

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి .టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారటి సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.

శ్రీ లీల ఆయనకు కూతురు పాత్రలో కనిపిస్తుంది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గ్రాండ్గా రిలీజ్ చేశారు మేకర్స్ . హనుమకొండలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ లీల మాట్లాడుతూ ..బాలయ్య ను ఓ రేంజ్ లో పొగిడేసింది .

అనిల్ రావిపూడి ని ఆకాశానికి ఎత్తేసింది . “ఇలాంటి ఓ మంచి స్టోరీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అంటూ గట్టిగా అరిచి చెప్పింది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి ఎలా కనెక్ట్ అయ్యాను అంటే అనిల్ రావిపూడి గారు కట్ చెప్పినా ఆ మూడ్ నుంచి బయటకు రాలేకపోయాను అంతలా ఎమోషనల్ టచ్ ఉంటుంది ..కచ్చితంగా నా పాత్ర మీ అందరికీ నచ్చుతుంది ..సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది “అంటూ తన మనసులోని మాటలు బయట పెట్టేసింది శ్రీ లీల..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news