News' స్కంద ' 4 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు... మిక్స్...

‘ స్కంద ‘ 4 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు… మిక్స్ డ్ టాక్‌తో వ‌సూళ్ల అరాచకం…!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ సినిమా ఈ వారాంతంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టాక్ మిక్స్ డ్ గా ఉన్నా కూడా థియేటర్ల లో మంచి హోల్డ్ తో దూసుకు పోతుంది. ముఖ్యంగా స్కంద మాస్ జ‌నాల‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది.

ఇక థియేట‌ర్ల‌లో ఊర‌మాస్ జ‌నాల‌కు న‌చ్చే సినిమా వ‌చ్చి కూడా చాలా రోజులు అవుతోంది. దీంతో స్కంద బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వీర‌విహారం ఆడేస్తోంది. కేవ‌లం 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 43.9 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే సోమ‌వారం కూడా సెలవు దినం కావడంతో మంచి వసూళ్లను రాబట్ట‌నుంది.

ఈ సినిమాలో యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి ? వసూళ్లను రాబడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news