Newsస‌మంత ఎంజాయ్ కోసం ఏం చేస్తుందో చూడండి...అదే ప‌నిమీద ఉంటోంది..!

స‌మంత ఎంజాయ్ కోసం ఏం చేస్తుందో చూడండి…అదే ప‌నిమీద ఉంటోంది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి తన మయోసైటిస్ చికిత్స కోసం.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతోంది. ఇప్పటికే మయోసైటిస్ కోసం అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సమంత ప్రశాంతత కోసం తనకి ఇష్టమైన ప్రదేశాలను చూసేందుకు ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఒకవైపు మెడిసిన్ వాడుతూనే మరోవైపు మనసును ఉల్లాసంగా ఉండేందుకు ప్రకృతిని ఆస్వాదిస్తుంది.

కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్తో తన జర్నీ ప్రారంభించిన సమంత తర్వాత ఇండోనేషియాలోని బాలి, అమెరికాలోని న్యూయార్క్ ఇలా వరుసగా తిరిగేస్తుంది. రీసెంట్గా వారం రోజుల క్రితం ఆస్ట్రియాకు వెళ్లిన సమంత అక్కడే ఉంటూ అక్కడ ప‌లు ప్రదేశాల‌ను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షార్ట్ ఫిలిం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొట్టింది.

ఆస్ట్రియాలోని సెల్జ్‌బర్గ్ అనే నగరాన్ని సందర్శించిన సమంత అక్కడే ఉన్న సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ సైకిల్ తొక్కుతున్న వీడియోలతో పాటు పలు ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది. సరస్సు పక్కనే కూర్చుని ప్రకృతిలో సేదతీరుతూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆస్ట్రియాలో జరిగే బాడీ పెయింటింగ్ కార్యక్రమానికి వెళ్లి దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది.

తాజాగా విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news