స్టార్ హీరోయిన్ సమంతకు ఎంత క్రేజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అంతేకాదు ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మరింత గొప్ప స్థానాన్ని అందుకుంది . అయితే ఆమె విడాకులు తీసుకోవడం ఫాన్స్ కు నచ్చడం లేదు. అది వేరే విషయం .
అయితే ఈ మధ్యకాలంలో సమంత ఓ హీరో విషయంలో చాలా గుర్రుగా ఉంది అంటూ ప్రచారం జరిగింది. గతంలో ఆమెను ప్రేమ పేరుతో ఆయన చీట్ చేశాడు అంటూ కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అయితే చాలాకాలం తర్వాత మళ్లీ సమంత ఆయనకు ఫోన్ చేసి మరి మాట్లాడుతుందట . ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ సిద్ధార్ధ్.
సిద్ధార్ధ్ సమంతలు ప్రేమించుకున్నారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడానికి కలిసి పూజలు కూడా చేశారు . అయితే ఆ తర్వాత వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారిది వాళ్ళది అంటూ వెళ్లిపోయారు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పుడు కూడా పరోక్షంగా సిద్ధార్ధ్ ఘాటుగా స్పందించారు . అయితే రీసెంట్గా సిద్ధార్ధ్ నటించిన “చిన్నా” సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకున్నింది. ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయిన సమంత తగాదాలు మర్చిపోయి సిద్ధార్థతో చేతులు కలిపినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అరుణ్ కుమార్ కు ప్రత్యేకంగా కాల్ చేసి గుడ్ డెసిషన్ మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నారు అంటూ పొగిడేసిందట. అంతేకాదు పరోక్షకంగా ఇలాంటి హీరోలకి అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా చెప్పుకొచ్చిందట. దీంతో మరోసారి సమంత సిద్ధార్ధ్ ల పేర్లు వైరల్ గా మారాయి..!!