పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మహారాష్ట్రలో పూణేలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఆమె రెండో పెళ్లి కోసం ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు కూడా బయట పెట్టింది. అయితే తనకు కాబోయే భర్త ఎవరన్నది ? మాత్రం ఆమె సీక్రెట్ గా ఉంచింది. ఎంగేజ్మెంట్ తర్వాత సడన్‌గా ఆమె పెళ్లి క్యాన్సిల్ అయింది దీని వెనక కారణం ఏంటన్నది ? అంతుపట్టటం లేదు.
తాజాగా దీనిపై స్పందించిన రేణు దేశాయ్ మరో రెండు యేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా అని తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాలేదని.. తన కుమార్తె మరి కొంచెం పెద్ద అయిన తర్వాత.. బాధ్యతలు కాస్త తీరాక పెళ్లి చేసుకుంటా అని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు తాను కాస్త ఎమోషనల్ గా ఇబ్బంది పడ్డానని.. ఇప్పుడు అన్ని విధాల బలోపేతం అయ్యానని అన్నారు.
అయితే రేణు దేశాయ్ ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న విషయాన్ని కూడా బయట పెట్టారు. తాను సినిమాలు నిర్మించడానికి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యానని.. ప్రస్తుతం రెండు చిన్న సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయని.. ఆ తర్వాత ఓ భారీ సినిమా కోసం మంచి యాక్షన్ కథ రెడీ చేశానని రేణు తెలిపారు. తనకు యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనే ఆలోచన లేదని.. మంచి కథ, మంచి బ్యానర్, మంచి దర్శకుడు ఈ మూడు కాంబినేషన్లో సెట్ అయితే సినిమాలు చేస్తా అన్నారు.
తనకు గతంలో కొన్ని మంచి స్క్రిప్టులు వచ్చినా.. ఈ మూడు సెట్ కాకనే చేయలేదన్నారు. ఇక తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అని.. తన గ్రాండ్ పేరెంట్స్ నుంచి తమ కుటుంబం ఈ వ్యాపారం కొనసాగిస్తుందని.. ప్రస్తుతం అదే తన ఆదాయం అని కూడా రేణు తెలిపారు.