టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ లో ఉన్నారు. సినిమా హిట్లూ.. ప్లాపులతో సంబంధం లేకుండా రవితేజకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈనెల 20న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇది రవితేజ కెరీర్లో భారీ పాన్ ఇండియా సినిమా.
రవితేజ కెరీర్ లో మర్చిపోలేని సినిమాలలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా ఒకటి. 2002 అక్టోబర్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అప్పట్లో నంది అవార్డ్ కూడా వచ్చింది. రవితేజకు జోడిగా సంగీత.. మరో హీరో శ్రీకాంత్ కి జోడిగా సోనాలి బింద్రే హీరోయిన్గా నటించారు. అలాగే కిమ్ శర్మ కూడా కీలకపాత్రలో కనిపించారు. ప్రకాష్‌రాజ్ కూడా కీలక పాత్రలో కనిపించారు. అయితే శ్రీకాంత్ కి జోడిగా నటించిన సోనాలి బింద్రే పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుంది. ఈ పాత్ర చనిపోతుంది.
శ్రీకాంత్ – సోనాలి బింద్రే మధ్య నువ్వు.. నువ్వు అనే ఒక సాంగ్ చాలా రొమాంటిక్‌గా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ. అయితే కృష్ణవంశీకి రవితేజకి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే రవితేజ శ్రీకాంత్ పాత్ర తనకు ఇవ్వాలని.. తన పాత్ర శ్రీకాంత్‌కి ఇవ్వాలని సోనాలి బింద్రేతో రొమాంటిక్ సాంగ్ ఉండాలని.. ఆ పాత్ర తాను చేస్తానని కృష్ణవంశీ దగ్గర ఎంతో పట్టుపట్టారట. సోనాలి బింద్రే పక్కన ఎలాగైనా నటించాలన్న తాపత్రయంతో రవితేజ నానా గోల గోల చేసేసాడట.
అయితే కృష్ణవంశీ అట్లా స్క్రిప్ట్ మార్చడం కుదరదు.. నీ పాత్ర నీకే కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పినా రవితేజ అయిష్టంగానే తన పాత్రకి అంగీకరించాడు. ఆ సినిమాలో రవితేజ పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే. అలాగే ఖడ్గం సినిమా అప్పట్లో కొన్ని కాంట్రవర్సీలకు కూడా కారణం అయింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఎంతో మంచి పేరు కూడా వచ్చింది.