తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చేయాల్సిన సినిమాలు మరొక హీరో చేసి సూపర్ హిట్ లో కొడుతూ ఉంటారు. ఇది కామన్ గా జరిగేది.. అలాగే మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అవ్వగా.. ఆ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. కొరటాల శివ దర్శకుడుగా పరిచయమైన సినిమా మిర్చి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 2013లో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మిర్చి సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్క – రీఛా గంగోపాధ్యాయ హీరోయిన్లు నటించారు.
దర్శకుడు కొరటాల శివ రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ భధ్ర సినిమాకి మాటలు అందించారు. ఆచనువుతోనే రవితేజకి ముందుగా కథ చెప్పారు. రవితేజ ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత ఇదే స్టోరీని ప్రభాస్ కు చెప్పగా ప్రభాస్ సింగిల్ టేక్ లో ఓకే చేశారు. ప్రభాస్ కి ఈ కథ నచ్చినా అంతకుముందే బాహుబలి సినిమాకు కమిటీ అయ్యారు. దీంతో మిర్చి సినిమా చేయాలా ? వద్దా అన్న డైలమాలో పడిపోయాడు.
చివరికి రాజమౌళి దగ్గర పర్మిషన్ తీసుకుని కేవలం 6 నెలల గ్యాప్‌లో మిర్చి సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రభాస్‌కు బాహుబలి సినిమాకు ముందు మంచి బూస్ట్ గా మిర్చి సినిమా వచ్చింది. మిర్చి తర్వాత కొరటాల శివ మహేష్ బాబుతో శ్రీమంతుడు – భరత్ అనే నేను ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్లు తెరకెక్కించారు. ప్రస్తుతం కొరటాల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.