రతిక .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా జనాలకు తెలిసేదే కాదు . కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమ్మడు పేరు ఓ రేంజ్ లో మారం మ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా హౌస్ లో రైతుబిడ్డ .. పల్లవి ప్రశాంత్ తో ఆమె నడిపిన డబల్ గేమ్ ట్రాక్ ..కొందరు జనాలకు నచ్చింది మరికొందరు జనాలకి ఎక్కడో మండేలా చేసింది. దీనితో తిక్క రేగిన జనాలు ఆమెకు ఓట్లు తక్కువగా వేసి ఆమె ను హౌస్ నుంచి బయటికి పంపించేశారు .
దీంతో చాలామంది జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు . మరి కొంతమంది ఏడ్చారు. అయితే సోషల్ మీడియాలో రతిక అందాలకు ఫిదా అయిపోయిన జనాలు చాలామంది ఆమెను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలి అంటూ తెగ హంగామా చేశారు . వీళ్ళల్లో స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ఫ్యాన్స్ రతికను ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందుకే ఆమెకు సంబంధించిన పోస్టర్స్ ను ట్రెండ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి రితిక మళ్ళీ వెళ్ళాలి అంటూ డిమాండ్ చేశారు.
రతిక హౌస్ లోకి వస్తే టీఆర్పీలు బాగా పెరుగుతాయని భావించిన బిగ్ బాస్ .. మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారట . దీనికి సంబంధించి ఓ ఇన్స్టా స్టోరీ షేర్ చేసింది రతిక వెల్కమ్ టు బిగ్ బాస్ రతిక అంటూ క్యాప్షన్ ఇచ్చి ఉన్న ఓ పోస్టర్ ని తన స్టోరీలో రిప్లై ఇస్తూ విక్టరీ సింబల్ జోడించింది . దీంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ మేరకే ఆమె హౌస్ లోకి వెళుతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది..!!