Newsస్కూల్ రికార్డుల ప్ర‌కారం రాజ‌మౌళి అస‌లు పేరు తెలుసా... న‌వ్వు ఆపుకోలేరు...!

స్కూల్ రికార్డుల ప్ర‌కారం రాజ‌మౌళి అస‌లు పేరు తెలుసా… న‌వ్వు ఆపుకోలేరు…!

టాలీవుడ్ దర్శకు ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ దర్శకుడు అయిపోయారు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా అక్కడ మరుమోగిపోతుంది. జపాన్లో సైతం ఆర్.ఆర్ రికార్డులు దుమ్ము దులుపుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా రాజమౌళి పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. స్కూల్ రికార్డుల్లో రాజమౌళి పేరు ఏంటో ? తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.

స్కూల్ రికార్డులు ప్రకారం రాజమౌళి పేరు విజయ అప్పారావు. ఇది తన తాతయ్య పేరు. ఈయనకు జక్కన్న అని పేరు పెట్టింది నటుడు రాజీవ్ కనకాల.. అయితే ఆ పేరుకు ఎన్టీఆర్ విశేష ప్రాధాన్యం కల్పించారు. రాజమౌళి పుస్తకాల పురుగు.. సాధారణ కథలకు తన క్రియేటివిటీ జోడించి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లటం చిన్నప్పుడే అలవర్చుకున్నారు. తన నానమ్మ వల్ల పుస్త‌కాల ప‌ఠ‌నం పై రాజమౌళి ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ఖాళీగా ఉన్న రాజమౌళిని జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నారు.. అని వదిన ( కీరవాణి సతీమణి) అడిగారట.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని జక్కన్న అప్పటినుంచి జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించారు. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా కొన్నాళ్లు పనిచేశారు. అలాగే దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు ఇంట్లో కొన్ని రోజులు ఉన్న రాజమౌళికి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరు కలిసి రాఘవేంద్రరావు దగ్గర పనిలో చేరారు.

ఆ తర్వాత రాఘవేంద్రరావు నిర్మాణంలో ఈటీవీలో ప్రసారమైన సూపర్ డూపర్ హిట్ శాంతినివాసం సీరియ‌ల్‌కు దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ కోసం రాజమౌళి యేడాదిన్నర పాటు రోజుకు 18 గంటలు కష్టపడేవారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడుగా మెగా ఫోన్ పట్టారు. నాటి నుంచి నేటి వరకు అసలు పరాజయం అన్నదే లేకుండా రాజమౌళి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news