టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 AD. ఇండియన్ మైథాలజికల్ క్యారెక్టర్స్ ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించే గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ కంప్లీట్ గా ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. కంప్లీట్ గా మోషన్ క్యాప్చర్ ఇమేజనరీ వరల్డ్ లో ఈ కథ నడవబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అనేలా విజువల్స్ ఉన్నాయి.
అమితాబచ్చన్ – కమలహాసన్ – దీపికా పదుకొనే – దిశాపటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో శ్రీ మహావిష్ణువు చివరి అవతారం అయినా కల్కిగా కనిపించబోతున్నాడు. అమితాబచ్చన్ లార్డ్ పరశురాం పాత్రలో నటిస్తున్నాడు. కమలహాసన్ విలన్ గా మొదటిసారి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. గతంలో కమల్ ప్రతినాయకుడు పాత్రలలో కనిపించినా అవి కమల్ సొంత సినిమాలు కావడం విశేషం.
కమల్ తొలిసారిగా చాలా ఏళ్ల తర్వాత తెలుగులో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ తో ఉన్న అనుబంధంతో పాటు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కోరిక మేరకు ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాజమౌళికి ఆఫర్ చేయడంతో ఆయన వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో రాజమౌళి సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమాలో సైంటిస్ట్ గా కనిపిస్తే కచ్చితంగా సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతో కొంత క్రేజ్ పెరుగుతుంది అనటంలో సందేహం లేదు. ఇక మేకింగ్ పరంగా కూడా రాజమౌళి సలహాలు.. సూచనలు తీసుకుంటున్నారని టాక్. వచ్చేయేడాది మే 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.