Moviesహీరోయిన్‌గా వ‌స్తోన్న హీరోయిన్ కూతురు… ఎవ‌రో తెలుసా…!

హీరోయిన్‌గా వ‌స్తోన్న హీరోయిన్ కూతురు… ఎవ‌రో తెలుసా…!

ముందానై ముడిచ్చు సినిమాతో హీరోయిన్గా పరిచయమై తన చిలిపితనంతో కూడిన నటనతో అప్పట్లో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకర్షించిన నటి మలయాళీ అమ్మాయి ఊర్వశి. ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి సూపర్ పాపులర్ అయ్యారు. 1980 – 90వ దశకంలో ప్రముఖ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆమె సౌత్ ఇండియాలోనే తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ప్రస్తుతం ఊర్వశి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు

నటిగా మంచి ఫామ్ లో ఉండగానే మలయాళ నటుడు మనోజ్ కె జ‌య‌న్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఊర్వశికి కుంజేట్టా అనే కుమార్తె కూడా ఉంది. పెళ్లయిన కొన్నేళ్ళకే మనస్పర్ధలు కారణంగా ఊర్వశి భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయినా కూతురు కుంజెట్టా మాత్రం అటు తండ్రితో పాటు ఇటు ఊర్వశి ఇద్దరి దగ్గర పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఊర్వశి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు.

తాజాగా ఆమె కూతురుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఊర్వశి వారసరాలు సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వటం ఖాయమని తెలుస్తోంది. ఆమెకు హీరోయిన్ కావలసిన అన్ని లక్షణాలు ఉండడంతో తర్వాత తరం హీరోయిన్ ఆమె అనే ప్రచారం రూపొందింది. ఊర్వశి కూడా తన కుమార్తెను హీరోయిన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని.. అందుకే కూతురికి గ్లామర్ టచ్ ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలకు విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కుంజెట్టాను హీరోయిన్గా పరిచయం చేయటానికి కొందరు మలయాళ దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మ‌ళ‌యాళంలో క్లిక్ అయితే కుంజెట్టా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి పెద్ద టైం ప‌ట్ట‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news