కొన్ని సినిమాలకు ఒక టీజర్ తోనే క్రేజ్ వచేస్తుంది.. కొన్ని సినిమాలకు ట్రైలర్ రిలీజ్ అయ్యాక కానీ క్రేజ్ రాదు. సినిమా విడుదల సంగతి తర్వాత సినిమాలు హిట్ అవుతాయి.. ఫట్ అవుతాయా అన్నది పక్కన పెడితే టీజర్ అనేది సినిమా మీద బజ్‌కు దారితీస్తుంది. అక్కడనుంచి బిజినెస్ లెక్కలు మొదలవుతాయి. అసలు టీజర్ వదిలేసే సినిమా మీద బజ్ కోసం, బిజినెస్ చేసుకునేందుకు..!
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత తీసిన మహాసముద్రం అంచనాలు అందుకోలేదు. కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్లో మంగళవారం సినిమా టీజర్ వదిలారు. ఈ సినిమాతో అజయ్ భూపతి లక్కీ హీరోయిన్ పాయల్ రాజపుత్ హీరోయిన్. టీజర్ వదిలేవరకు అసలు మంగళవారం సినిమా ఏ జానర్ అన్నది ఎవరికీ తెలియదు.
టీజర్ వచ్చింది మంచి హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థం అయింది. అంతకుమించి టీజర్ లో పడిన రెండు మూడు అడల్ట్ కంటెంట్ షాట్లు సినిమాపై ఉన్న బజ్‌ను అమారంతం పెంచేశాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ ఆంధ్ర – సీడెడ్ కలిపి ఏకంగా రు. 7.20 కోట్ల సింగిల్ లో అమ్మేశారు.. అమ్మేశారు అనటం కన్నా టీజర్ చూసి కొనుక్కున్నారు అనటం కరెక్ట్.
అయితే ఇలా కొనుక్కున్నవారు కేవలం ఆంధ్ర హక్కుల కోసమే ఆరు కోట్లు చెబుతున్నారు. రెండు కోట్లు అనుకుంటే విడుదలకు ముందే బయ్యర్ కు రు. 20 లక్షల లాభం అన్నమాట. పాయల్ రాజ్ పుత్‌కు ఆర్ఎక్స్ 100 తర్వాత ఇప్పటివరకు హిట్ లేదు.. అజయ్ భూపతి కూడా రెండో సినిమాతో సక్సెస్ కొట్టలేదు. ఇప్పుడు మంగళవారం టీజర్‌తోనే దుమ్ము లేపుతున్నాడు. ఏదేమైనా పాయల్ రెండు షాట్లతో మంగళవారం సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.