ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ఈ రీమిక్స్ సినిమా అంచనాలు అందుకోలేదు. పవన ప్రస్తుతం ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ – హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు. పవన్ స్వతహాగా హీరో మాత్రమే కాదు.. ఆయన ఒక ఫైట్ మాస్టర్.. ఆయనలో ఒక డైరెక్టర్ కూడా దాగి ఉన్నాడు.
ఖుషి, జానీ లాంటి సినిమాలకు పవన్ ఫైట్లు స్వయంగా కంపోజ్ చేసుకున్నాడు. అలాగే పవన్ తన సినిమాలో కొన్ని సీన్లు కూడా డైరెక్ట్ చేసుకున్నాడు. పవన్ కు కెరీర్ స్టార్టింగ్ లో హీరో అవ్వాలని ఆలోచన లేదట. డైరెక్టర్ కావాలన్నదే పవన్ కోరిక.. కానీ కుటుంబ సభ్యులు వద్దనడంతో పవన్ తన నిర్ణయాన్ని మార్చుకొని హీరోగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పైగా తన సోదరుడు చిరంజీవికి పవన్ డైరెక్టర్ అవటం అస్సలు నచ్చలేదట.
పవన్ దర్శకుడు కావాలనుకుంటున్న టైంలోనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశాడు. న్యూ ఇయర్ ఫిలిం అకాడమీలో షార్ట్ ఫిలిం కోర్సు కోసం పవన్ అప్లికేషన్ పెట్టుకున్నాడట. ఈ క్రమంలోనే ఒక షార్ట్ ఫిలిం కూడా తీసి పవన్ ఆ అకాడమీ వారికి పంపారట. ఈ షార్ట్ ఫిలిం అంధుల జీవితాల గురించి తెరకెక్కింది. ఆ తర్వాత పవన్ ను హీరోని చేయాలని బలంగా డిసైడ్ అయిన చిరంజీవి వైజాగ్ లో సత్యానంద్ ఇనిస్ట్యూట్లో చేర్పించారు.
సత్యానంద దగ్గర ఏడాది పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరో అయ్యారు. తొలి సినిమా మొదలు ఖుషి సినిమా వరకు పవన్ కు అస్సలు ప్లాప్ అన్నదే లేదు. ఆ దెబ్బతో టాలీవుడ్ లో ఒక్కసారిగా తిరుగులేని పవర్ స్టార్ అయిపోయారు.